Movie News

అజిత్… అప్పులు తీర్చడం కోసమే

ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్లలో అజిత్ ఒకడు. తన చివరి చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి అతను రూ.150 కోట్ల మేర పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాతి చిత్రానికి రెమ్యూనరేషన్ ఇంకా పెరగొచ్చు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి ఎదగడం అసామాన్యమైన విషయం. విశేషం ఏంటంటే.. అజిత్ నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి రాలేదట. తన తండ్రి వ్యాపారంలో నష్టపోవడం వల్ల వచ్చిన అప్పులు తీర్చడానికే ఈ రంగంలోకి వచ్చాడట. ఈ విషయాన్ని కెరీర్ ఆరంభంలో మీడియా వాళ్లు అడిగితే.. ఓపెన్‌గా చెప్పేసేవాడినని అజిత్ తెలిపాడు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే అజిత్.. తనకు పద్మభూషణ్ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా తాను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానో వెల్లడించాడు అజిత్.

‘‘అసలు నాకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం ఏ రోజూ లేదు. నేను రేసర్ అవ్వాలని అనుకున్నా. ముందు రెండు మూడు ఉద్యోగాలు చేశాను. తర్వాత రేసింగ్ చేస్తుండగా మోడలింగ్ చేయమని కొందరు సలహాలిచ్చారు. రేసింగ్‌లోకి వెళ్లాలన్న నా ఆసక్తిని గమనించిన నా తల్లిదండ్రులు.. అందుకు తగ్గ ఆర్థిక స్థోమత మనకు లేదని చెప్పారు. తర్వాత సినీ రంగంలోకి వెళ్తానంటే అప్పుడూ కంగారు పడ్డారు. ఎలాగోలా అనుకోకుండా నటుడినయ్యా.

నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నా. మొదట్లో నా నటన ఘోరంగా ఉండేది. కెరీర్‌ తొలినాళ్లలో నేను చేసిన సినిమాలకు వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పేవాళ్లు. ఆ తర్వాత కఠోర సాధనతో నన్ను నేను చాలా మెరుగుపరుచుకున్నా. కెరీర్ ఆరంభంలో ఎవరైనా మీరెందుకు సినిమాల్లోకి వచ్చారని అడిగితే.. నిజాయితీగా సమాధానం చెప్పేవాడిని. ‘మా కుటుంబానికి వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పులు తీర్చడానికి ఇండస్ట్రీలోకి వచ్చా’ అని చెప్పేసేవాడిని. డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చావా అని వాళ్లు రెట్టించి అడిగితే.. నేను నిజాయితీగా సమాధానం చెప్పినందుకు అభినందించమని అనేవాడిని’’ అని అజిత్ వెల్లడించాడు.

This post was last modified on May 2, 2025 1:01 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ajith

Recent Posts

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

13 minutes ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

24 minutes ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

3 hours ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

12 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

13 hours ago