కరోనాను లైట్ తీసుకున్న చాలామంది ప్రముఖులు కూడా దానికి తలవంచి ప్రాణాలే కోల్పోయిన ఉదంతాలు చాలానే చూశాం. సినీ, రాజకీయ, వ్యాపార, కళా రంగాలకు చెందిన ఎంతోమంది కరోనా వల్ల అసువులు బాసారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుుడ రాజశేఖర్ కండిషన్ సీరియస్ అనగానే అందరిలో ఆందోళన నెలకొంది.
అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి విషమంగా మారినట్లు ఆయన భార్య జీవిత ఇప్పుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. రాజశేఖర్ ఆరోగ్యం గురించి ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో వైద్యులు ఆయనను అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశారని జీవిత తెలిపారు. ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు, ఆయనకు వెంటిలేటర్ పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. రాజశేఖర్‌కు బయటి నుంచి ఇన్వేసివ్ వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ అందించారు తప్ప.. గొంతు లోపల పెట్టే వెంటిలేటర్ ఎప్పుడూ పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి చాలా విషమ స్థాయికి వెళ్లిన మాట మాత్రం వాస్తవమన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఆ దశ నుంచి రాజశేఖర్ కోలుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నెమ్మదిగా బయటి నుంచి అందించే ఆక్సిజన్‌ను తగ్గిస్తున్నారని.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని.. త్వరలోనే ఐసీయూ నుంచి బయటికి వస్తారన్న ఆశాభావంతో ఉన్నామని ఆమె వెల్లడించారు. ఈ కష్ట కాలంలో అభిమానులు రాజశేఖర్‌పై ఎంతో ప్రేమ చూపించారని, ఆయన కోసం ప్రార్థించారని, వారి వల్లే ఆయన కోలుకుంటున్నారని చాలా ఎమోషనల్‌గా చెప్పారు జీవిత. ఆమెతో పాటు కూతుళ్లు శివాని, శివాత్మిక సైతం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 4, 2020 6:04 pm
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…