కొన్ని అరుదైన కలయికలు తెరమీద అంత సులభంగా జరగవు. వాటి కోసం సంవత్సరాలు లేదా దశాబ్దాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. అలాంటిదే నందమూరి బాలకృష్ణ, రజనీకాంత్ కాంబో. ఈ ఇద్దరూ కలిసి జైలర్ 2లో సందడి చేయడం ఖరారైనట్టే. చెన్నై వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే దీనికి సంబంధించిన షూట్ చేయబోతున్నారు. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కు ఇచ్చిన ఎలివేషన్లు ఏ స్థాయిలో పేలాయో చూశాం. వాటిని మించిపోయేలా పవర్ ఫుల్ బ్లాక్ ఒకటి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడో ప్రత్యేకమైన విశేషం చెప్పుకోవాలి.
రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో స్వర్గీయ ఎన్టీఆర్ ‘టైగర్’లో నటించారు. ఇది 1979లో రిలీజయ్యింది. అమితాబ్ బచ్చన్ ఖూన్ పసినా రీమేక్ గా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయడం, తెలుగుదేశం జయకేతనం ఎగరేయడంతో మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. బాలకృష్ణతోనూ వెండితెర మీద రజినిని చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు దక్కలేదు. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అన్నగారి వారసుడు బాలయ్యతో రజని చేతులు కలపడం అంటే స్పెషల్ మూమెంటే. వచ్చే ఏడాది విడుదలకు జైలర్ 2 రెడీ అవుతోంది. సంక్రాంతి ఆప్షన్ పరిశీలిస్తున్నారు.
ఇంకొక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే జైలర్ 2 తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ పలు సందర్భాల్లో నిర్మాణ సంస్థ ఇచ్చిన హింట్స్ దాదాపు ఖరారు చేసేశాయి. అంటే ముందు బాబాయ్ ని డైరెక్ట్ చేసి ఆ తర్వాత అబ్బాయిని దర్శకత్వం వహించే ఛాన్స్ నెల్సన్ కు దక్కబోతోంది. ఇంకా షూటింగ్ సగం కూడా కాకుండానే జైలర్ 2కి తెలుగు నుంచి భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. యాభై కోట్ల నుంచి నెంబర్ మొదలవుతోందని అంటున్నారు. అయితే కూలి రిలీజయ్యాకే జైలర్ 2 వ్యాపార వ్యవహారాలు మొదలవుతాయి.
This post was last modified on April 30, 2025 2:18 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…