విశ్వంభర విడుదల తేదీ విషయంలో ఎంత సందిగ్దత నెలకొందో చూస్తున్నాం. జూలై 24 రిలీజనే ప్రచారం కొద్దివారాలుగా జరుగుతోంది కానీ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవలే వదిలిన రామ రామ సాంగ్ బాగానే వెళ్తోంది. పాటలు వచ్చేస్తున్నాయి కాబట్టి త్వరలోనే ఈ విజువల్ గ్రాండియర్ ని చూడొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ తాజా పరిణామాలు కొత్త ఆప్షన్ ఎన్నుకునేలా చేస్తున్నాయని మెగా కాంపౌండ్ టాక్. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న పనులు మరింత ఆలస్యమయ్యే పక్షంలో సెప్టెంబర్ 25 విశ్వంభరని తీసుకొచ్చే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. ఆపై వారంలో దసరా పండగ ఉంటుంది.
ఇదంతా ఓకే కానీ సెప్టెంబర్ 25 ఇంతకు ముందే రెండు ప్యాన్ ఇండియా సినిమాలు లాక్ చేసుకున్నాయి. మొదటిది అఖండ 2 తాండవం. ఆ టైంకంతా అన్ని కార్యక్రమాలు పూర్తవ్వడం అనుమానంగానే ఉంది కాబట్టి 2026 సంక్రాంతి వైపు చూస్తున్నారని తాజా సమాచారం. ఎన్టీఆర్ నీల్ ఎలాగూ బరి నుంచి తప్పుకుంది కాబట్టి బాలయ్యకు పండగ సెంటిమెంట్ కలిసొస్తుంది. ఇక రెండోది సంబరాల ఏటిగట్టు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25 వస్తుందని నెలల క్రితమే చెప్పారు. ఒకవేళ విశ్వంభర వస్తానంటే మావయ్య కోసం మేనల్లుడు తప్పుకుంటాడు.
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ పైన చెప్పిందంతా సదరు ప్రొడక్షన్ టీమ్ లో జరుగుతున్న చర్చల సారాంశమే. విశ్వంభరకు సోలో రిలీజ్ తో పాటు క్వాలిటీ టైం కావాలి. పవన్ కళ్యాణ్ ఓజి కనక సెప్టెంబర్ 5 వచ్చే పక్షంలో ఇరవై రోజుల గ్యాప్ లో అన్నయ్య రావడం మంచిదే. కాకపోతే అక్టోబర్ మొదటి వారంలో కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కడై లాంటి ఇతర సినిమాలున్నాయి.ఆగస్ట్ పోటీ దృష్ట్యా ఆ నెలలో ఛాన్స్ లేదు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, జూలైలోనే వదలమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ సెప్టెంబర్ నే విశ్వంభర కోరుకుంటే మేనమామ కోసం మేనల్లుడు రిలీజ్ డేట్ త్యాగం చేయడం తప్పదు.
This post was last modified on April 30, 2025 6:02 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…