ఎల్లుండి విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కోసం అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత నెల రోజులుగా దినదిన గండంగా మారిన థియేటర్ల నిర్వహణకు తిరిగి ఊపిరి పోసేది నానినే అన్న నమ్మకం వాళ్లలో బలంగా ఉంది. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉండటం ప్రీ రిలీజ్ బజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణకు సంబంధించిన టికెట్ అమ్మకాలు మొదలైపోయాయి కానీ ఆంధ్రప్రదేశ్ వి ఇంకా స్టార్ట్ చేయలేదు. టికెట్ ధరల జిఓతో అదనపు ఆట అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా హిట్ 3 మిడ్ నైట్ ప్రీమియర్లు బుధవారం అర్ధరాత్రి 1 గంటకు వేసే ఆలోచనలో నాని ఉన్నట్టు తెలిసింది. నైజాంలో కష్టం కానీ ఏపీలో అనుమతులు వచ్చేస్తాయి. దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ వగైరాలు అర్ధరాత్రి షోలతో కొన్ని బ్లాక్ బస్టర్, కొన్ని డిజాస్టర్ ఫలితాలు అందుకున్నాయి. అదే కాన్ఫిడెన్స్ తో హిట్ 3కి వేయాలని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారట. అదే జరిగితే న్యాచురల్ స్టార్ కెరీర్ లో ఇంత త్వరగా షోలు ప్రదర్శించడం ఇదే మొదటిసారి అవుతుంది. అసలే వేసవి సెలవులు. కాలేజీలు లేక యూత్ హాలిడేస్ లో ఉన్నారు. సో టాక్ రాక ముందే ముందస్తు ఆటలకు రెడీ అయిపోతారు. ఎలాగూ మాస్ ఆడియన్స్ అండ ఉండనే ఉంటుంది.
కాకపోతే ఒక రిస్క్ ఉంటుంది. మిడ్ నైట్ కాబట్టి సరైన టాక్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. దేవర ఈ సమస్యని ఎదురుకుంది. తొలుత యావరేజ్ అన్నారు కానీ కట్ చేస్తే అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 పట్ల కూడా సోషల్ మీడియాలో నెగటివిటీ కనిపించింది. అసలు టాక్ వచ్చాక అవన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోయాయి. కాకపోతే ఇవన్నీ యు/ఏ సినిమాలు. పిల్ల పీచు అందరూ వచ్చారు. కానీ హిట్ 3కి సున్నితంగా ఆలోచించే ఫ్యామిలీస్ రావొద్దని శైలేష్, నానినే చెబుతున్నారు. సో టార్గెట్ కొంచెం కష్టమవుతుంది. ఎప్పుడు వేసినా బొమ్మ అదిరిపోవడం ఖాయమనే కాన్ఫిడెన్స్ నాని టీమ్ లో పుష్కలంగా కనిపిస్తోంది.
This post was last modified on April 29, 2025 10:56 pm
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…