గొప్ప పొటెన్షియల్ ఉన్న సినిమాను తీసి బాగా ప్రమోట్ చేసుకోవడమే కాదు దాన్ని రిలీజ్ పరంగా పక్కా ప్లానింగ్ తో ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి హిట్ 3 ది థర్డ్ కేస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకో నలభై గంటల లోపే విడుదల ఉన్నా ఇంకా మొదలుపెట్టకపోవడం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆర్టికల్ చదివే సమయానికి స్టార్టయ్యి ఉండొచ్చేమో కానీ తెలంగాణలాగా కనీసం నాలుగైదు రోజుల ముందు టికెట్ల అమ్మకాలు మొదలుపెడితే ప్రేక్షకులకు సౌకర్యవంతంగా, కావాల్సిన థియేటర్ ఎంచుకోవడానికి నిర్ణయం తీసుకునే విధంగా ఉండేది.
టికెట్ రేట్ల పెంపు జిఓనో లేదా డిస్ట్రిబ్యూటర్స్ తో ఏదైనా ఇష్యూనో కారణం ఏదైనా కావొచ్చు, చివరి నిమిషం వరకు ఒత్తిడి పడేలా లేకుండా చూసుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో అవసరం. హైక్ కావాలనుకున్నా లేదా వద్దనుకున్నా దానికి తగ్గ కార్యాచరణ ముందే సెట్ చేసుకోవాలి. పబ్లిసిటీ కోసం నాని ఎడతెరిపి లేకుండా రాష్ట్రాలు తిరుగుతూ ఇంటర్వ్యూలు, ఈవెంట్లంటూ తెగ బిజీగా ఉన్నాడు. బిజినెస్ కు సంబంధించిన ప్రతిదీ తనే చూసుకోలేకపోవచ్చు. కానీ ఆ బాధ్యత తీసుకున్నవాళ్ళను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి ఇబ్బందులు గతంలో హాయ్ నాన్న, సరిపోదా శనివారంకు కూడా వచ్చాయి.
ముందస్తుగా బుకింగ్స్ పెట్టడం వల్ల ఒక్క హైదరాబాద్ లోనే రెండున్నర కోట్ల గ్రాస్ వసూలయ్యిందని ట్రేడ్ టాక్. కరెంట్ బుకింగ్స్ కాకుండా ఇంత నెంబర్ నమోదు కావడం విశేషం. అన్ని ప్రాంతాలు కలిపి ఒక్క తెలుగు వెర్షనే నాలుగు కోట్ల మార్కుకు దగ్గరగా ఉంది. ఒకవేళ ఏపీ కూడా దీనికి తోడై ఉంటే సంఖ్య ఇంకా భారీగా ఉండేది. సరే జరిగిందేదో జరిగిందని అనుకోవడం కాకుండా ఇకపై రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాని నిర్మించిన కోర్ట్ కు ఇదే ఏపీలో మూడు రోజుల ముందే బుకింగ్స్ పెట్టగలిగినప్పుడు తనే హీరోగా నటించిన హిట్ 3కి ఎందుకు సాధ్యం కాలేదు. ఇలాంటి ప్రాక్టికల్ ప్రశ్నలే అభిమానుల నుంచి వస్తాయి.
This post was last modified on April 29, 2025 7:28 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…