ప్రయాణానికి అంత సౌకర్యంగా ఉండని ఎగుడుదిగుడుల ఎత్తయిన రోడ్డుని ఘాట్ సెక్షన్ గా పిలుస్తాం. విశ్వంభర జర్నీ అచ్చం ఇలాగే ఉంది. షూటింగ్ టైంలో సంక్రాంతి విడుదలని గొప్పగా చెప్పుకున్నారు. తర్వాత గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేశారు. పోనిలే మార్చిలో వచ్చి రంగస్థలంలాగా హిట్టు కొడుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఏప్రిల్ అయిపోయింది. మేలో ఛాన్స్ లేదు. జూన్ డౌటే. ఇక మిగిలింది జూలై. ఖచ్చితంగా ఆ నెలలోనే రావాలి. ఎందుకంటే ఆగస్ట్ లో వార్ 2, కూలి లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. పోటీ పడితే అనవసరమైన రిస్క్. సో వేరే ఆప్షన్ లేదు.
ఇంత స్పష్టంగా పరిమితులు కనిపిస్తున్నా విశ్వంభర నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించడం లేదు. విఎఫ్ఎక్స్ పనులు బ్యాలన్స్ ఉండొచ్చు గాక. కానీ ఫలానా డెడ్ లైన్ పెట్టుకుంటే ఇంకా వేగంగా చేసే అవకాశం ఉంటుంది కదా. చేతిలో ఇంకో రెండు నెలలకు పైగానే సమయం ఉంది. హ్యాపీగా వాడుకోవచ్చు. ఎలాగూ ఒక ఆడియో సాంగ్ వదిలారు. గుడులకు పెన్ డ్రైవ్ లు ఇవ్వడం ద్వారా ప్రచారం వేగం పెంచారు. కానీ అసలైన రిలీజ్ డేట్ ఊసే లేదు. ఇదంతా ఓకే కానీ అనుష్క ఘాటీ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందో చూద్దాం. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఈ ప్యాన్ ఇండియా మూవీ కూడా ఏప్రిల్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
విశ్వంభర, ఘాటీ రెండు సినిమాలను నిర్మిస్తున్నది యువి క్రియేషన్సే. ముందు మెగా మూవీ సంగతి తేలితే అప్పుడు స్వీటీది డిసైడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే రెండింటి మధ్య తగినంత గ్యాప్ ఉంటే పబ్లిసిటీ చేసుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. లేదూ మైత్రి లాగా రెండు తక్కువ టైంలోనో లేదా ఒకేసారి రిలీజ్ చేసే సాహసం చేస్తామంటే దానికైనా సిద్ధపడొచ్చు. అనుష్క వరకు షూటింగ్ అయిపోయిందని, ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని ఒక టాక్ వినిపిస్తోంది. ముందు విశ్వంభర క్లారిటీ వచ్చేస్తే ఆ వెంటనే ఘాటీ డెసిషన్ వచ్చేస్తుందని అంతర్గత సమాచారం. చూద్దాం ఏం చేస్తారో.
This post was last modified on April 30, 2025 5:36 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…