విడుదలకు ఒక సినిమా (భైరవం) సిద్ధంగా ఉన్నా, మరొకటి ఫినిషింగ్ (టైసన్ నాయుడు) కు దగ్గరలో ఉన్నా, వీటికన్నా చాలా ఆలస్యంగా మొదలైన మరొక ప్యాన్ ఇండియా మూవీ ‘కిష్కిందపురి’ టీజర్ రావడం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు జరిగిన అరుదైన ఫీట్ గా చెప్పుకోవాలి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ నుంచి ఇంత త్వరగా ప్రమోషన్లు మొదలు కావడం ఊహించనిది. ట్విస్ట్ ఏంటంటే ఈ మాంస్సూన్ లోనే రిలీజ్ అవుతుందని చెప్పేశారు. మాములుగా ఋతు పవనాలు జూన్ లో మొదలై సెప్టెంబర్ దాకా ఉంటాయి. వీటి మధ్యలోనే కిష్కిందపురి వస్తుందని క్లారిటీ ఇచ్చారు.
టీజర్ చిన్నదే అయినా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. శతాబ్దాల తరబడి మూసేసిన ఒక పాడుబడిన బంగాళా. లోపలికి వెళ్లే సాహసం ఎవరూ చేయరు. దానికి హీరో హీరోయిన్ తో పాటు వాళ్ళ స్నేహితులు పూనుకుంటారు. అందరూ అనుకున్నట్టు అదేదో ఆషామాషీ దెయ్యాల వ్యవహారం కాదని దాంట్లో అడుగు పెట్టాక అర్థమవుతుంది. చిత్ర విచిత్రాలు జరుగుతాయి. పాయింట్ పరంగా కొత్తగా లేకపోయినా ఇంటెన్స్ విజువల్స్, సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఏదో దాచి పెట్టిన సస్పెన్స్ ఎలిమెంట్ వగైరాలు ఆసక్తిని పెంచుతున్నాయి. హారర్ తో పాటు అన్ని మిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. అంచనాల పరంగా ఇదంతా పాసయ్యేలానే ఉంది.
మొత్తానికి సాయిశ్రీనివాస్ ట్రెండ్ ఫాలో అయిపోయాడు. ఇటీవలే నాగచైతన్య కూడా ఇదే తరహా బ్యాక్ డ్రాప్ తో ఎన్సి 24 మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, కిరణ్ అబ్బవరం ‘క’లు ఇదే కోవలో సూపర్ హిట్ అందుకున్నాయి. రాక్షసుడు తర్వాత బెల్లంకొండ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా ఇదే. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద పెద్ద బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. డేట్ ఇంకా చెప్పలేదు కానీ భైరవంకు దీనికి మధ్య కనీస గ్యాప్ ఉండేలా చూసుకునే అవకాశముంది. ఫైనల్ గా బెల్లం హీరో 2026లో రెండ్ సినిమాలు ఇవ్వడం కన్ఫర్మ్.
This post was last modified on April 29, 2025 4:51 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…