గత కొన్నేళ్లలో యూత్‌లో బాగా ఫాలోయింగ్ సంపాదించిన టాలీవుడ్ యువ నటుల్లో శ్రీ విష్ణు ఒకడు. సరదాగా సాగే తన సినిమాలు, క్యారెక్టర్లు యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఐతే చిలిపిగా, అగ్రెసివ్‌గా ఉండే క్యారెక్టర్లలో సులువుగా ఒదిగిపోతున్న శ్రీ విష్ణు.. సందట్లో సడేమియా అన్నట్లు ఆ పాత్రల్లో డబుల్ మీనింగ్, బూతు డైలాగులను చిత్రమైన స్టయిల్లో వల్లిస్తుండడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతోంది. సామజవరగమనతో పాటు స్వాగ్ మూవీలో శ్రీ విష్ణు డైలాగుల మీద చాలా చర్చ జరిగింది. ఈ సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాక తన డైలాగుల్లో మర్మాన్ని నెటిజన్లు అర్థం చేసుకున్నారు. చాలా స్పీడుగా డైలాగులు చెబుతూ.. బూతులు అర్తం కాని విధంగా మాట్లాడ్డంలో శ్రీ విష్ణు సిద్ధహస్తుడనే పేరొచ్చింది.
తన కొత్త చిత్రం సింగిల్‌లోనూ ఈ ఛాయలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విలేకరులు శ్రీ విష్ణు చెప్పే డబుల్ మీనింగ్ డైలాగుల గురించి ప్రస్తావించారు. దీనికి శ్రి విష్ణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులేమీ ఉండవని అతనన్నాడు. తాను మాట్లాడేది సంస్కృతమని.. అది అర్థం కాక జనం డబుల్ మీనింగ్ అనుకుంటున్నారని శ్రీ విష్ణు అన్నాడు.
తాను ఇప్పుడు సంస్కృతం నేర్పలేనని విలేకరిని ఉద్దేశించి శ్రీ విష్ణు సరదాగా వ్యాఖ్యానించాడు. తాను చెప్పే డైలాగులు సాధారణ వేగంలో చూస్తే అర్థం కావని.. ఓటీటీలో స్పీడు తగ్గించి చూస్తే అర్థమవుతాయని శ్రీ విష్ణు అన్నాడు. సింగిల్ మూవీలో కథానాయికగా నటించిన కేతిక శర్మ.. దీని కంటే ముందు రాబిన్ హుడ్ మూవీలో చేసిన స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వివాదాస్పదం అయ్యాయి కదా, మరి మీ చిత్రంలో అలాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే.. అలాంటి వాటికి ఈ చిత్రంలో ఆస్కారం లేదని శ్రీవిష్ణు తెలిపాడు. ఈ ఈవెంట్‌కు శ్రీ విష్ణు పంచెతో రావడంపై మరో హీరోయిన్ ఇవానా ప్రశ్నించగా.. వేసవి కదా, గాలాడుతుందని ఈ డ్రెస్‌లో వచ్చినట్లు చమత్కరించాడు శ్రీ విష్ణు.
This post was last modified on April 29, 2025 9:54 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…