టాలీవుడ్లో చాలామంది హీరో హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం అనే ఆలోచనలోనే ఉంటారు. ఒక సినిమా హిట్ అయ్యాక వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకుని చకచకా సినిమాలు లాగించేస్తుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తారు. చాలా టైం తీసుకుని ఒక్కో సినిమా పూర్తి చేస్తారు. లేటుగా ప్రేక్షకులను పలకరించినా సరే.. సరైన సినిమాతోనే అయ్యుండాలని భావిస్తారు. అలాంటి హీరోల్లో అడివి శేష్ ఒకడు. ‘క్షణం’ దగ్గర్నుంచి అతను ఒక్కో సినిమాతో ఎలా పైకి ఎదుగుతున్నాడో తెలిసిందే. శేష్ సినిమా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలపడింది.
చివరగా 2022లో ‘హిట్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేష్. తర్వాత రెండేళ్లకు పైగా కాలం గడిచింది. కానీ ఇప్పటిదాకా తన కొత్త చిత్రం విడుదల కాలేదు. గూడఛారి సీక్వెల్ (జీ2), డెకాయిట్ చిత్రాల్లో నటిస్తున్న శేష్.. వాటి గురించి ఏ అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. శేష్ బయట కనిపించడం తక్కువ. అలా కనిపించినపుడు కూడా తన సినిమాల అప్‌డేట్స్ ఏమీ ఇవ్వడు. తాజాగా ‘హిట్-3’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా శేష్ తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడిందేమీ లేదు. కానీ ఈ వేడుకలో వేరే వాళ్ల నోళ్ల నుంచి శేష్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ బయటికి వచ్చాయి.
విశ్వక్సేన్ మాట్లాడుతూ.. శేష్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడని, అందులో ఒకటి జూన్‌లో రిలీజవుతుందని చెప్పాడు. శేష్ చిత్రాల్లో ముందు మొదలైంది ‘జీ2’నే కాబట్టి అదే జూన్‌లో రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ‘హిట్-3’ యాక్షన్ కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో శేష్ ఫైట్ ఉంటుందని పొరపాటున లీక్ ఇచ్చేశాడు. దీంతో ‘హిట్-3’లో శేష్ క్యామియో కన్ఫమ్ అయినట్లే. ఇందులో విశ్వక్ సైతం ఓ సన్నివేశంలో కనిపిస్తాడని గతంలో వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో తెలియదు. మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తి సినిమా చివర్లో మెరుస్తాడని ఇంతకుముందే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 28, 2025 2:27 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…