Movie News

హిట్ 3 గురించి నాని – ‘మనల్ని ఎవడ్రా ఆపేది’

హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు. ఆషామాషీగా ఎవరినో తీసుకొస్తే దీని రేంజ్ కు తగ్గట్టు ఉండదని భావించి ఏకంగా రాజమౌళినే ముఖ్యఅతిథిగా వచ్చేలా చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఈగ టైం నుంచి బాండింగ్ మొదలైన సంగతి తెలిసిందే. దాని తర్వాత ఈ కాంబో మళ్ళీ సాధ్యం కానప్పటికీ నాని అంటే జక్కన్నకు ప్రత్యేక మక్కువ ఎప్పుడూ ఉంటుంది. ఈ కారణంగానే మజ్నులో ఒక చిన్న సన్నివేశంలో గెస్టుగా నిజ జీవిత పాత్రను పోషించడం అభిమానులు మర్చిపోలేరు. అందుకే నానికి జక్కన్న ఎప్పుడు వచ్చినా అంత ఆనందం కలుగుతుంది.

మరోసారి ఈ వేదిక సాక్షిగా నాని హిట్ 3 మీద తన నమ్మకాన్ని బహిర్గత పరుచుకున్నాడు. తన మాటల్లోనే క్లుప్తంగా చూద్దాం. “నా వెనుక రాజమౌళి ఉన్నారు. ముందు మీరున్నారు. కడుపులో తిరుపతి వెంకటేశ్వరస్వామి ప్రసాదముంది. మే 1 థియేటర్లలో మీకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయం. ఇక్కడ అనొచ్చో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది. కొత్త సినిమాలు రిలీజైనప్పుడు రాజమౌళి ఫ్యామిలీ ప్రీమియర్లకు వెళ్లి పంచుకునే అభిప్రాయాన్ని ఈసారి హిట్ 3 కోసం ఎదురు చూస్తున్నా. దాని కోసం ఏదైనా ప్రయాణం ప్లాన్ చేసుకుంటే జక్కన్న పాస్ పోర్ట్ లాక్కోవడానికి కూడా రెడీ”

ప్రసంగాన్ని కొనసాగిస్తూ “హిట్ 3 లో థాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి సక్సెస్ మీట్ లో మాత్రమే మాట్లాడగలను. కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పా. నా జడ్జ్ మెంట్ నిజమయ్యింది. ఇప్పుడు ప్యారడైజ్ వేరే నిర్మాత కాబట్టి తాకట్టు పెట్టలేను కానీ ఎస్ఎస్ఎంబి 29 అందామంటే ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ప్రపంచమంతా చూసే సినిమా అది. ఒక మాస్ ఫిలింని క్రైమ్ జానర్ ని ముడిపెట్టడం కష్టం. కానీ హిట్ 3లో అది ఆర్గానిక్ గా కుదిరింది. మే 1 బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం”. సో చూశారుగా నాని నమ్మకం ఏ స్థాయిలో ఉందో. థియేటర్లను మళ్ళీ కళకళలాడించేలా హిట్ 3 గట్టిగానే కొట్టేలా ఉంది.

Kumar

Recent Posts

వార‌ణాసి విల‌న్‌ క్యారెక్టర్… రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

రాజమౌళి, మ‌హేష్ బాబుల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న వార‌ణాసి సినిమాలో రామాయ‌ణం నేప‌థ్యంలో ఒక అరగంట యుద్ధ స‌న్నివేశాలు ఉంటాయ‌ని…

6 hours ago

సాయిపల్లవి వదులుకుంటే సమంత అందుకుంది

జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…

7 hours ago

అక్కడ తోటి పిల్లలే టీచర్లు…

ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…

9 hours ago

ఒకే సినిమాలో 200 పాటలు

తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…

10 hours ago

ఉప్పెనకు ప్లస్సు… పెద్దికదే మైనస్సు

సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…

10 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… మోడీ స‌మీక్ష‌?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) ఉద్య‌మ సంఘం నాయ‌కుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫ‌లించింది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల…

12 hours ago