Movie News

తుస్సుమన్న కామెడీ క్లాసిక్ రీ రిలీజ్

34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో హిట్ ముద్ర వేసుకుని క్షేమంగా బయట పడింది. మైనే ప్యార్ కియా, దిల్ లాంటి లవ్ స్టోరీస్ చూసిన కళ్ళతో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ జంట కామెడీని అప్పటి ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. అందుకే 5 కోట్ల 40 లక్షల వసూళ్లతో సోసో అనిపించుకుంది అయితే తర్వాత దీనికి కల్ట్ ముద్ర దక్కింది. హోమ్ వీడియో వచ్చాక క్యాసెట్లు, డివిడిలు, యూట్యూబ్, ఓటిటిలో చూసిన జనం కడుపుబ్బా ఎంజాయ్ చేశారు. క్లాసిక్  స్టేటస్ వచ్చేసింది. దీంతో రీ రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతుందనుకున్నారు.

మొన్న శుక్రవారం మళ్ళీ విడుదలైన అందాజ్ అప్నా అప్నా వసూళ్లు తీసికట్టుగా ఉన్నాయి. మొదటిరోజు కేవలం 25 లక్షలు రాగా రెండో రోజు 30 లక్షలతో ఎదురీదుతోంది. నిర్మాణ సంస్థ చాలా ఖర్చు పెట్టి 4కె తో పాటు డాల్బీ సౌండ్ జత చేయించింది. మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్లు చేశారు. సల్మాన్, అమీర్ ఇద్దరూ ప్రత్యేకమైన బైట్స్ ఇచ్చారు. దీంతో సహజంగానే జనం ఎగబడతారనుకుంటే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇవాళ మహా అయితే ఇంకో పాతిక లక్షలు వస్తే గొప్పనేలా ఉంది. అది కూడా ముంబై లాంటి నగరాల్లో బుకింగ్స్ పర్వాలేదు కాబట్టి ఈ మాత్రం నెంబర్లు కనిపిస్తున్నాయి.

చూస్తుంటే సీనియర్ స్టార్ల ఇమేజ్ రీ రిలీజుల విషయంలో ఏమంత పని చేయడం లేదు కాబోలు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇద్దరూ డిజాస్టర్లలో ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఒకపక్క రెండు బ్లాక్ బస్టర్లు ఇస్తే వీళ్ళేమో వరస ఫ్లాపులతో ఉసురూమనిపించారు. అందాజ్ అప్నా అప్నా లాగే ఆ మధ్య గ్రాండ్ గా విడుదల చేసిన కరణ్ అర్జున్ సైతం జనాల తిరస్కారానికి గురయ్యింది. కహో నా ప్యార్ హై కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అసలు టైంలో సూపర్ ఫ్లాప్ గా నిలిచిన సనమ్ తేరి కసం, లైలా మజ్ను లాంటివి భారీ వసూళ్లు తేగా క్లాసిక్స్ మాత్రం ఇలా అవమానకర రీతిలో తోక ముడవడం అనూహ్య పరిణామం.

This post was last modified on April 27, 2025 5:05 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

10 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

4 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago