కాళ్లకు చక్రాలు కాదు రాకెట్లు కట్టుకుని మరీ హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల కోసం తిరుగుతున్న నాని ఈసారి మాములు నమ్మకంగా లేడు. ప్యాన్ ఇండియా పబ్లిసిటీ చేయడం తనకు కొత్త కాకపోయినా ఇతర భాషలకు సంబంధించి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వీడియోలు, ఇంటర్వ్యూల రూపంలో కనిపిస్తోంది. ముంబైకి వెళ్తే ముందు రైడ్ 2 చూడమని, చెన్నైలో రెట్రోకి ప్రాధాన్యం ఇచ్చాకే హిట్ 3 చూడమని రిక్వెస్ట్ చేయడం లాంటి చర్యలు ఆభిమానుల మనసులు గెలుచుకునేలా చేశాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కాశ్మీర్ ప్రాంతంలో షూట్ చేసిన ఒక ఎపిసోడ్ చాలా రోజుల పాటు చర్చించుకునేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
ఇటీవలే పెహల్గామ్ లో పాకిస్థాన్ తీవ్రవాదులు విరుచుకుపడి టూరిస్టుల ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. చేయని తప్పుకు ఇరవై ఆరు అమాయకులు బలైపోయారు. దీనికి దగ్గరగా అనిపించే ఒక యాక్షన్ బ్లాక్ హిట్ 3లో ఉందట. అర్జున్ సర్కార్ జమ్మూ కాశ్మీర్ లో పని చేసేటప్పుడు ఇలాంటి సంఘటనే జరిగితే దానికి అతను రియాక్ట్ అయ్యే విధానం ఒళ్ళు జలదరించే స్థాయిలో ఉంటుందని వినికిడి. సినిమాలో తర్వాత వచ్చే కీలక ట్విస్టులకు ఇదే శ్రీకారం చుడుతుందని అంటున్నారు. టెర్రరిస్టులతో నాని కలబడే ఘట్టం గురించే ఈ డిస్కషన్ అంతా. ఇది ఎప్పుడో నెలల క్రితం షూట్ చేయడం గమనించాల్సిన విషయం.
ట్రైలర్ లో కొన్ని విజువల్స్ ని జాగ్రత్తగా డీ కోడ్ చేస్తే పైన చెప్పిన మ్యాటర్ కనెక్ట్ అవుతుంది. శ్రీనిధి శెట్టితో ప్రేమ ఆ పై పెళ్లి కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. మొత్తానికి చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది కదూ. ఇదంతా లీక్ కాదు. షూటింగ్ టైంలో వచ్చిన అప్డేట్స్, కాశ్మీర్ షెడ్యూల్, ట్రైలర్ లో చూపించిన సీన్స్ అన్నీ కలగలుపుకుంటే ఇక్కడ చెప్పింది మ్యాచ్ అవుతుంది. మే 1 గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న హిట్ 3 కోసం ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది. కొన్ని వారాల తర్వాత థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యే దృశ్యం మళ్ళీ దీంతోనే మొదలవుతుందని ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే బుకింగ్స్ భారీగా ఉన్నాయి.
This post was last modified on April 27, 2025 12:45 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…