మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న అలప్పుజ జింఖానా తెలుగు డబ్బింగ్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. మైత్రి సంస్థ పంపిణి చేయడంతో మంచి రిలీజ్ దక్కింది. అయితే మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా నెమ్మదిగా మొదలైన ఈ యూత్ డ్రామా క్రమంగా స్లో పాయిజనవుతున్న వైనం బుకింగ్స్ లో కనిపిస్తోంది. సారంగపాణికి స్థిరంగా సగటున రోజుకు పది వేల లోపు టికెట్ల అమ్మకాలు చూపిస్తుండగా జింఖానా దానికి రెట్టింపు కన్నా ఎక్కువ నమోదు చేయడం గమనార్హం. ముఖ్యంగా కాలేజీ యువత నుంచి ఫుట్ ఫాల్స్ ఎక్కువగా ఉన్నాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాల సమాచారం.
ఏ సెంటర్ల వరకు బాగానే ఉన్నా బిసి కేంద్రాల్లో జింఖానా కొంచెం స్ట్రగులవుతున్న వైనం స్పష్టం. ఉదయం, మధ్యాన్నం షోలకు పెద్దగా ఆక్యుపెన్సీలు కనిపించడం లేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఓకే కానీ పట్టణాల్లో వసూళ్లు వేగంగా లేవు. అయినా కూడా ఈ వారం డామినేషన్ జింఖానాదే. ఆరుగురు ఇంటర్ చదివిన కుర్రాళ్ళు పై చదువుల కోసం స్పోర్ట్స్ కోటాలో బాక్సింగ్ అకాడెమి చేరతారు. లోకల్ గేమ్స్ లో గెలిచినా స్టేట్ లెవెల్ కు వెళ్ళాక అసలు సవాల్ మొదలవుతుంది. ఈ పాయింట్ చుట్టూ దర్శకుడు ఖలీద్ రెహమాన్ పూర్తిగా యువత అల్లరి, ఎమోషన్స్ ని ఆధారంగా చేసుకుని జింఖానాని తీర్చిదిద్దాడు.
కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో బాక్సింగ్ క్రీడకు ఆదరణ తక్కువ కాబట్టి కాన్సెప్ట్ పరంగా కొంచెం నెమ్మదిగా కనెక్ట్ అవుతోంది. ఫస్ట్ హాఫ్ మాములుగా ఉన్నా సెకండాఫ్ ని నడిపించిన విధానం జింఖానాను పాస్ క్యాటగిరీలో వేసింది. మే 1 హిట్ 3 ది థర్డ్ కేస్, రెట్రో విడుదలవుతున్న నేపథ్యంలో జింఖానాకు ఆదివారం కలెక్షన్లు కీలకం కాబోతున్నాయి. వీలైనంత ఎక్కువ రాబట్టుకుంటే బ్రేక్ ఈవెన్ దాటేసుకోవచ్చు. రెస్పాన్స్ చూస్తుంటే సులభమే అనిపిస్తుంది. గత ఏడాది సైలెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్టయిన ప్రేమలు అంత రేంజ్ కాకపోయినా కొంచెం నెమ్మదిగా అయినా సరే జింఖానా హిట్టు క్యాటగిరీలో పడేలా ఉంది.
This post was last modified on April 26, 2025 9:51 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…