ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. బుక్ మై షోలో ఇంత ముందస్తుగా అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టిన స్టార్ హీరో సినిమా ఈ మధ్య కాలంలో ఇదొక్కటే. మహా అయితే ఒకటి రెండు రోజుల కంటే ముందు ఆన్ లైన్ సేల్స్ పెట్టడం నిర్మాతల వల్ల కావడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఉన్న లావాదేవీల కారణంగా ఆలస్యం కావడం మాములు విషయమైపోయింది. కానీ నాని పక్కా ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందంటే ఓవర్సీస్ హార్డ్ డిస్కులను చివరి నిమిషం వరకు హడావిడి చేయకుండా ముందుగానే డిస్పాచ్ అయ్యేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇక టికెట్ రేట్ల సంగతికి వస్తే తెలంగాణలో గరిష్టంగా అనుమతి ఉన్న ధరలనే హిట్ 3కి ఫాలో అవుతున్నారు. మల్టీప్లెక్సుల్లో 295, సింగల్ స్క్రీన్లలో 175 రూపాయలు ఎప్పటిలాగే ఉండబోతున్నాయి. వీటి కోసం ఎలాంటి ప్రత్యేక పర్మిషన్లు అక్కర్లేదు. నేరుగా పెట్టేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా లేదు. మల్టీప్లెక్స్ 177, సింగల్ స్క్రీన్ 110 నుంచి 145 వరకు ఉంది. ఈ కారణంగానే రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లకు కొన్ని ప్రాంతాలకు ఏపి ప్రభుత్వం నుంచి జిఓ తెచ్చుకున్నారు. ఇప్పుడు హిట్ 3 విషయంలో నాని ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అడిగితే నో అనకుండా వెంటనే హైక్ కోసం అనుమతులు వస్తాయి.
పాజిటివ్ టాక్ వస్తే పెంపు వచ్చే ఇబ్బంది ఏం ఉండదు. సంక్రాంతికి వస్తున్నాం విషయంలో ఇది బాగా రుజువయ్యింది. 75 నుంచి 125 దాకా పెంచుకునే వెసులుబాటు ఇవ్వడంతో ఆంధ్రా ప్రాంతాల్లో భారీ నెంబర్లు నమోదయ్యాయి. సంక్రాంతి సీజన్ తో మే నెలను పోల్చలేం కానీ బాక్సాఫీస్ డ్రైగా ఉంటూ ఎగ్జిబిటర్లు నానా తంటాలు పడుతున్న టైంలో వాళ్ళను ఊపిరి పోయాల్సిన బాధ్యత హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండబోయే ఈ క్రైమ్ థ్రిల్లర్ కు మహారాజ పోషకులు మాస్, యూత్ ఆడియన్సే. వాళ్ళను మెప్పించగలిగితే టికెట్ హైక్స్ ని భరిస్తారు. చూడాలి మరి ఏం చేయబోతున్నారో.
This post was last modified on April 26, 2025 10:30 am
నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…
కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…
కింగ్ డమ్ కోసం ముందు అనుకున్న జూలై 4 త్యాగం చేసిన తమ్ముడు కొత్త విడుదల తేదీ జూలై 25…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…