తమిళ స్టార్ హీరో సూర్యకు ఎంతో కీలకమైన సినిమా.. రెట్రో. కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. తన చివరి చిత్రం ‘కంగువ’ కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటే.. అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ‘రెట్రో’ మీద తన ఆశలన్నీ పెట్టుకున్నాడు సూర్య. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని టీజర్, ట్రైలర్ చూస్తే.. సూర్యకు పర్ఫెక్ట్ సినిమా అని, అతడికి కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందనే అంచనాలు కలిగాయి. ఐతే ఈ కథ నిజానికి సూర్య కోసం రాసిందే కాదట. ఇంతకుముందు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘పేట’ మూవీ చేసిన కార్తీక్.. మళ్లీ ఆయన కోసమే రాసిన కథనే ‘రెట్రో’ అట.
కానీ కొన్ని కారణాలతో ఈ సినిమాను ఆయనతో చేయలేకపోయానని.. సూర్యతో చేశానని.. కానీ ఆయన వచ్చాక చాలా మార్పులు జరిగాయని ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ వెల్లడించాడు. రజినీ కోసం కథ రాసినపుడు అది పూర్తిగా యాక్షన్ ప్రధానంగా ఉందట. రజినీ వయసు దృష్ట్యా ఆయనకు లవ్ స్టోరీ, రొమాంటిక్ ట్రాక్ పెడితే బాగుండదని.. కాబట్టే యాక్షన్ కథగా దాన్ని తీర్చిదిద్దానని కార్తీక్ తెలిపాడు. ఐతే సూర్యతో ఈ కథ చేయాలి అనుకున్నాక.. యాక్షన్ డోస్ తగ్గించి ఇందులోకి ప్రేమకథను తీసుకొచ్చానని కార్తీక్ తెలిపాడు.
ఈ కథను ముందు రజినీకి చెప్పావా అని సూర్య అడిగాడని.. ఔనని బదులిచ్చానని కార్తీక్ వెల్లడించాడు. ‘రెట్రో’ అందరూ అనుకుంటున్నట్లు గ్యాంగ్‌స్టర్ స్టోరీ కాదని అతను స్పష్టం చేశాడు. ఇందులో ప్రేమకథే ప్రధానమని.. దాని చుట్టూ మిగతా అంశాలను చేర్చానని.. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ కథ సాగుతుందని కార్తీక్ తెలిపాడు. సూర్య సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ ఆస్థాన సంగీత దర్శకుడైన సంతోష్ నారాయణన్ మ్యూజిక్ చేశాడు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.
This post was last modified on April 24, 2025 2:35 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…