Movie News

ముహూర్తానికి వచ్చి.. హీరోయిన్‌గా ఫిక్స్ చేసి..

టాలీవుడ్లో కొత్త వాళ్లను బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళలో నాని ఒకడు. అతను ఎక్కువగా కొత్త, అప్‌కమింగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తుంటాడు. హీరోయిన్లు, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లను కూడా కొత్త వాళ్లనే పరిచయం చేస్తుంటాడు. అతను హీరోయిన్లను రిపీట్ చేయడం తక్కువ. నాని కొత్త చిత్రం ‘హిట్-3’లో కన్నడ అమ్మాయి, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఆమెతో నాని జత కట్టడం ఇదే తొలిసారి. శ్రీనిధిని ‘హిట్-3’కి ఎంపిక చేసింది దర్శకుడు శైలేష్ కొలను కాదట. నానినే స్వయంగా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట. అది అనుకోకుండా జరిగిందని స్వయంగా హీరోయిన్ శ్రీనిధినే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తాను తెలుగులో కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘తెలుసు కదా’ ముహూర్త వేడుకకు వచ్చిన నాని.. తనకు ఛాన్స్ ఇచ్చినట్లు శ్రీనిధి తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘తెలుసు కదా’. ఇందులో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా కథానాయికగా నటిస్తోంది. నీరజకు నాని క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఆమె దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం ముహూర్త వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఆ సందర్భంగా శ్రీనిధిని చూసి, మాట్లాడిన నాని.. తన పక్కన ఆమె మంచి పెయిర్ అవుతుందని భావించాడట. తర్వాత ‘హిట్-3’ మొదలు కాగానే ఆమెకే తన పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడట. ఇలా అనుకోకుండా తాను ‘హిట్-3’లో భాగం అయ్యానని శ్రీనిధి చెప్పింది. విశేషం ఏంటంటే.. నాని ఏ సినిమా ముహూర్త వేడుకకు వెళ్లి శ్రీనిధిని తన చిత్రంలోకి తీసుకున్నాడో ఆ సినిమా ఇంకా విడుదలకు సిద్ధం కాలేదు. కానీ ‘హిట్-3’ ఈ లోపే పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరి ‘హిట్-3’ శ్రీనిధికి తెలుగులో ఎలాంటి ఆరంభాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 24, 2025 2:13 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

2 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

2 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

2 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

3 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago