Movie News

పహల్గామ్ దాడి – సినిమాపై నిషేధం ?

నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడిలో 28 పైగా అమాయక టూరిస్టులు చనిపోవడం యావత్ దేశాన్ని కలచివేసింది. పర్యాటక సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళను మతం అడిగి మరీ ప్రాణాలు తీసిన వైనం ప్రతి భారతీయుడి ఆగ్రహానికి కారణమవుతోంది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన ఇవాళ ఉదయం భారతదేశానికి వచ్చేశారు. సరిహద్దుల్లో ప్రక్షాళన చర్యలు మొదలుపెట్టిన ఆర్మీ ఇప్పటికే ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చడం కొత్త పరిణామాలకు దారి తీస్తోంది. ఈ దుర్ఘటనకు స్పందనగా ఒక బాలీవుడ్ మూవీని నిషేధించాలనే పిలుపులు ఊపందుకున్నాయి.

వచ్చే నెల మే 9 హిందీ సినిమా అబిర్ గులాల్ విడుదలవుతోంది. పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ హీరోగా నటించగా వాణి కపూర్ అతని జోడిగా కనిపించనుంది. ఆర్తి ఎస్ బాగ్ది దర్శకత్వం వహించగా అమిత్ త్రివిది సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే ట్రైలర్ వచ్చేసింది. ఈ ఫహద్ ఖాన్ కు ఇది ఇండియన్ డెబ్యూ కాదు. 2014 ఖూబ్సూరత్ తో తెరంగేట్రం చేశాడు. 2016 కపూర్ అండ్ సన్స్, ఏ దిల్ హై ముష్కిల్ లో కనిపించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లుగా పాకిస్థాన్ లో ఉంటూ ఏడెనిమిది సినిమాల్లో నటించాడు. వాటిలో ది లెజెండ్ అఫ్ మౌలా జాట్ మన దేశంలోనూ రిలీజ్ దక్కించుకుంది. ఇప్పుడీ అబీర్ గులాల్ ద్వారా ఈ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

లవ్ రొమాంటిక్ జానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ మొదలైపోయింది. పక్క దేశం ప్రోత్సహిస్తున్న చర్యలకు నిరసనగా ఇది జరగాల్సిందేనంటూ పలువురు నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అబీర్ గులాల్ వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలున్నట్టు బాలీవుడ్ రిపోర్ట్. అయినా మన దగ్గరే గంపెడు హీరోలు, వాళ్ళలో పుష్కల ప్రతిభా పాటవాలు ఉండగా అదే పనిగా పాకిస్థాన్ నటుడిని తీసుకొచ్చి యాక్ట్ చేయించడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఫహద్ ఖాన్ ఇప్పుడీ అటాక్స్ గురించి స్పందించకపోతే నిరసన మరింత తీవ్రం కావడం ఖాయం.

This post was last modified on April 23, 2025 12:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

8 minutes ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

2 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

3 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

4 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

4 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

5 hours ago