ఒక్క చిన్న టీజర్ తో సినిమా మీద విపరీతమైన బజ్ వచ్చేలా చేసిన ఘనత ఈ మధ్య కాలంలో దర్శకుడు బుచ్చిబాబుకే దక్కుతుంది. సరిగ్గా ఐపీఎల్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో సిక్సర్ కొట్టించే షాట్ ని పొందుపరిచి అది వైరలయ్యే స్థాయిలో చూపించిన విధానం ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. కేవలం ఈ చిన్న వీడియోతోనే బిజినెస్ ఎంక్వయిరీలు మూడు నాలుగింతలు పెరిగాయంటే ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే పెద్ది ముందు అనుకున్నది చరణ్ కోసం కాదని, జూనియర్ ఎన్టీఆర్ కనే ప్రచారాలు ఆ మధ్య తిరిగాయి. దానికి బుచ్చిబాబు ఒక ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
పెద్ది వెనుక ఉన్న పెద్ద కథ వివరించాడు. అదేంటో చూద్దాం. “ఉప్పెన విడుదల సమయంలో కరోనా ఉంది. నా మొదటి సినిమా ఓటిటిలో వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందా. కానీ అదృష్టవశాత్తు థియేటర్లలో రిలీజై వసూళ్లతో పాటు అవార్డులు తీసుకొచ్చింది. నాకు మూలాలున్న కథలు అది కూడా గ్రామీణ నేపథ్యంలో రాసుకోవడం ఇష్టం. పెద్ది అయ్యాక ముందు సుకుమార్ గారికి వినిపించా. ఆయనే రామ్ చరణ్ పేరు రికమండ్ చేశారు. కాసేపు వింటారనుకున్న చరణ్ తుదికంటా శ్రద్ధగా విని నెరేషన్ అయిపోయాక క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా కార్యరూపం దాల్చింది”
“పెద్ది పాత్ర రాసుకోవడానికి ముందు నా హీరోకి ఈ పేరే పెట్టాలని పిఠాపురం రామ మందిరంలో ఉన్నప్పుడు సంకల్పించుకున్నాను. ఇంత త్వరగా అది నెరవేరడం చూస్తే అది భగవంతుడి ఆశీర్వాదమే అనిపిస్తుంది. నాకు భక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. చరణ్ కు నాకు ఈ సారూప్యత మా బంధాన్ని మరింత దగ్గర చేసింది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని కాల్పనికత జోడించి పెద్ది రాసుకున్నా. పెద్దిలో ప్రపంచమంతా మెచ్చుకున్న క్రికెట్ షాట్ కంపోజ్ చేసిన నవకాంత్ మాస్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు” సో ఇదన్న మాట పెద్ది బ్యాక్ స్టోరీ. చాలామంది అనుకున్నట్టు కాకుండా పెద్ది వెళ్ళింది నేరుగా చరణ్ దగ్గరికే.
This post was last modified on April 22, 2025 11:13 am
అసలే ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోతోంది ఏదో ఒకటి చేయమని అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు…
ఎంపీలకు తమ నియోజకవర్గం పరిధిలోని శాసన సభ స్థానాల పై పట్టు ఉండడం వేరు. ఎందుకంటే.. ఎంపీ లాడ్స్ నుంచి…
ఎంత పెద్ద స్టార్ అయినా రాజమౌళి సినిమాలో నటించేటప్పుడు వేరే ఆలోచనలు చేయడం, ఇతర స్క్రిప్ట్ లు వినడం కానీ…
ఈ మధ్య రీ రిలీజులకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు. అందులోనూ ముప్పై నలభై సంవత్సరాల క్రితం వచ్చిన వాటిని…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ…
వైసీపీలో నాయకులు బయటకు రావడం లేదు. ఎన్నికలు పూర్తయి ఏడాది అయినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. నోరు…