హిట్ 3 ది థర్డ్ కేస్ థియేటర్లలో అడుగు పెట్టేందుకు ఇంకో పది రోజులు మాత్రమే ఉంది. ఫైనల్ వర్క్స్ లో దర్శకుడు శైలేష్ కొలను బిజీగా ఉండటంతో నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టిని వెంటేసుకుని ప్యాన్ ఇండియా ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. తిరిగి వచ్చాక హైదరాబాద్ లో తెలుగు మీడియాతో ఇంటరాక్షన్లు, ఈవెంట్లు ఉండబోతున్నాయి. ఒక రౌండ్ ఆల్రెడీ అయిపోయాయి కూడా. చేతిలో ఉన్న తక్కువ సమయంలో టెన్ డేస్ కు తగ్గట్టు పది సవాళ్లు నాని ముందున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది ట్రైలర్ రెస్పాన్స్. భారీ స్పందన దక్కింది కానీ ఫ్యాన్స్ ఊహించిన స్థాయిలో కంటెంట్ ఫీలవ్వలేదని వాస్తవం. ఇంకా బలమైంది కావాలి. అందుకే హైప్ పెంచేందుకు ఒక మంచి రిలీజ్ ట్రైలర్ కావాలనేది ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ అభిప్రాయం.
రెండోది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇలాంటి ఇంటెన్స్ డ్రామాలను నిలబెట్టే అనిరుధ్, తమన్, అజనీష్ లాంటి వాళ్ళను కాకుండా మిక్కీ జె మేయర్ ను తీసుకోవడం గురించి అభిమానులు కొంత ఆందోళనగా ఉన్నారు. మూడోది ఎండలు. జనాలు థియేటర్లకు దూరంగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమే. నాలుగోది ఐపీఎల్ మ్యాచులు. చాలా రసవత్తరంగా జరుగుతున్న క్రికెట్ గేమ్స్ ఆడియన్స్ ని సాయంత్రాలు ఇంట్లోనే కట్టి పడేస్తున్నాయి. అయిదోది డ్రై బాక్సాఫీస్. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా హిట్లు ఉన్నాయి కానీ ఊగిపోయే బ్లాక్ బస్టర్లు పడలేదు. దీంతో ప్రేక్షకుల్లో కొత్త రిలీజుల పట్ల కొంత అనాసక్తి సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది.
ఆరోది వయొలెన్స్. ఎలాగూ నానినే ఫ్యామిలీస్ ని దూరంగా ఉండమని చెబుతున్నాడు కాబట్టి మాస్, యూత్ తోనే పని కానివ్వాలి. అంటే యానిమల్ రేంజ్ టాక్ సొంతం చేసుకోవాలి. ఏడోది హీరోయిన్ పరంగా ఎలాంటి అడ్వాంటేజ్ లేకపోవడం. కెజిఎఫ్ భామనే అయినా శ్రీనిధి శెట్టికి జనాల్లో ఫుల్ లేదు. ఎనిమిదోది సూర్య రెట్రోతో పోటీ. దీన్ని తక్కువంచనా వేయడానికి లేదు. ఒక్కోసారి డబ్బింగ్ సినిమాలు సర్ప్రైజ్ ఇస్తాయి. తొమ్మిదోది దసరా, సరిపోదా శనివారం సక్సెస్ స్ట్రీక్ కొనసాగించడం. ఆఖరిది మరియు పదోది రాబోయే ది ప్యారడైజ్ కి ఇప్పుడీ హిట్ 3 ద్వారా బలమైన పునాది వేయడం. ఈ సవాళ్ళన్నీ కాచుకోగలిగితే నానికి విజయం ఖాయం.
This post was last modified on April 21, 2025 6:58 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…