హరిహర వీరమల్లు విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. మే 9 వస్తుందా రాదానే క్లారిటీ ఇంకా టీమ్ నుంచి రాలేదు. ఆ మధ్య ఒక అఫీషియల్ పోస్టర్ వదిలాక మళ్ళీ అప్డేట్స్ లేవు. ఇంకో ఇరవై రోజులు మాత్రమే సమయం ఉండటంతో వాయిదా తప్పకపోవచ్చనే వార్త ఉన్న ఆసక్తిని మరింత తగ్గించేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టి మరోసారి ఓజి వైపు వెళ్తోంది. నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు సుజిత్ మేలో డేట్లు దొరుకుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పవన్ కనక ఇవ్వగలిగితే వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్ బరిలో దింపాలనేది ప్రాధమికంగా ఉన్న ప్లాన్. కానీ అదంత ఈజీ కాదు.
ఎందుకంటే వీరమల్లు కోసం కనీసం నాలుగైదు రోజులు ఇవ్వలేకపోతున్న పవన్ తొలి ప్రాధాన్యం ఏఎం రత్నంకే. పైగా అమెజాన్ ప్రైమ్ నుంచి డెడ్ లైన్ ఉందన్న వార్తల నేపథ్యంలో మే మిస్సయినా జూన్ లో అయినా వీరమల్లు రిలీజ్ చేస్తేనే చాలా పెట్టుబడులు సేఫ్ అవుతాయి. అసలు బజ్ పెంచడమే పెద్ద సవాల్ గా మారుతోంది. ఇదే సమస్య ఓజికి కూడా ఉంది. నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ ప్రకారం 2025లోనే థియేట్రికల్ రిలీజ్ జరగాలట. కానీ సాధ్యాసాధ్యాలు విశ్లేషించుకుంటే అవుతుందా లేదానే అనుమానం వస్తుంది. పైగా నాలుగు నెలల గ్యాప్ లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలంటే నమ్మశక్యం కాని విషయం.
ఇంకో పాయింట్ ఉంది. ఓజిలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం డీ ఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నారట. అంటే ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీలో కుర్ర అజిత్ ని చూశాం కదా, అచ్చం అదే తరహాలో వింటేజ్ పవన్ కనిపించే కొన్ని సన్నివేశాలకు గాను సుజిత్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలిసింది. ఇది నిజమైన పక్షంలో ఇప్పుడు అనుకున్న టైం సరిపోదు. అప్పుడు నెట్ ఫ్లిక్స్ కి సర్దిచెప్పి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజిలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ లాంటి పెద్ద విలన్ గ్యాంగ్ ఉంది. సంగీతం గురించి తమన్ ఇప్పటికే ఓ రేంజ్ ఎలివేషన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
This post was last modified on April 21, 2025 1:30 pm
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…