టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న చెక్కుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ టాలీవుడ్ లో మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రల ఫస్ట్ లుక్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఆనాటి చరిత్రను ఆవిష్కరిస్తూనే తెరకెక్కిస్తోన్న ఈ కల్పిత కథలో తాజాగా మరో చరిత్రాత్మక ఘట్టం కూడా ఉండబోతోందని తెలుస్తోంది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన ‘జలియన్ వాలాబాగ్’ ఎపిసోడ్ ను ఈ సినిమాలో జక్కన్న చూపించబోతున్నారని టాక్ వస్తోంది.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గుర్తుండిపోయే చేదు ఘటన జలియన్ వాలా బాగ్ ఉదంతం. భారతీయులపై జనరల్ డయ్యర్ అమానుషానికి నిదర్శనం ఆ దుర్ఘటన. ఆనాడు డయ్యర్ ఆదేశాలతో తెల్లదొరలు జరిపిన కాల్పుల్లో 1000 మంది భారతీయులు మరణించారు. ఈ ఘటనతోనే బ్రిటిషువారిని తరిమికొట్టాలన్నకసి భారతీయుల్లో పెరిగిందని చెబుతారు. ఈ రకంగా స్వాతంత్ర్య సంగ్రామాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనను ‘ఆర్ఆర్ఆర్’లో కళ్లకు కట్టినట్టు జక్కన్న చూపించబోతున్నారని టాక్ వస్తోంది.
అయితే, వాస్తవానికి అల్లూరి, కొమరం భీమ్ లకథలకూ, జలియన్ వాలాబాగ్ ఘటనకు సంబంధం లేదు. ఆ మాటకొస్తే కొమరం భీమ్, అల్లూరి అసలు ఒక్కసారి కూడా కలవలేదు. అయితే, కల్పిత కథ కాబట్టి పిరియాడికల్ ఎపిసోడ్ కోసం జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని సినిమాలో చూపించబోతున్నారట. ఇది కల్పిత కథ అని చెబుతున్నప్పటికే ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై కొందరు వివాదం రేపారు. ఈ నేపథ్యంలో ఈ జలియన్ వాలాబాగ్ ఎపిసోడ్ ఉందా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలవ వెయిట్ చేయక తప్పదు. ఒక వేళ ‘ఆర్ఆర్ఆర్’లో ఆ హిస్టారిక్ ఎపిసోడ్ ఉంటే మాత్రం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఖాయం.
This post was last modified on November 2, 2020 3:52 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…