నిన్న సూర్య రెట్రో ట్రైలర్ రిలీజయ్యింది. కంగువా అల్ట్రా డిజాస్టర్ తర్వాత ఇది ఖచ్చితంగా కంబ్యాక్ అవుతుందనే నమ్మకంతో హీరో, అభిమానులు ఇద్దరూ ధృడంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ట్రైలర్ మీదే ఉంది. అర్ధమయ్యి కానట్టు వెరైటీగా కట్ చేసిన వీడియోలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను చెప్పీ చెప్పకుండా అసలు ట్విస్టులను తెలివిగా దాచేశాడు. ఎంత ట్రై చేసినా ఇదో బాషా టైపు గ్యాంగ్ స్టర్ డ్రామా అని, కాకపోతే ట్రెండీగా ఉంటుందనే క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రేమలు డైరెక్ట్ చేసిన ఆల్ఫోన్స్ పుత్రేన్ తో దీన్ని ఎడిట్ చేయించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక అంచనాల విషయానికి వద్దాం.
తెలుగు ఆడియెన్స్ కోణంలో చూసుకుంటే రెట్రో మీద ఒక్కసారిగా బజ్ వచ్చేంత కంటెంట్ ట్రైలర్ లో లేదు. స్టైలిష్ షాట్స్, ఇంటెలిజెంట్ టేకింగ్, సూర్య మార్క్ మేనరిజం, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం దేనికవే ప్రత్యేకంగా నిలబడ్డాయి కానీ కొంత మేర కన్ఫ్యూజన్ ఏర్పడిన మాట కూడా వాస్తవమే. మాములుగానే కార్తీక్ సుబ్బరాజ్ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. మనోళ్లకు అంత సులభంగా కనెక్ట్ కాదు. అందుకే జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా తెలుగులో మటుకు డిజాస్టరే. అతను చూపించే ఆర్గానిక్ స్టోరీ టెల్లింగ్ పద్దతి టాలీవుడ్ ట్రెండ్ కు సూట్ కాదు.
ఇదంతా ఓకే కానీ డబ్బింగ్ విషయంలో అంత క్వాలిటీ కనిపించకపోవడం ఫ్యాన్స్ వెలితిగా ఫీలవుతున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఫైనల్ వెర్షన్ టైంలో మార్పులు చేర్పులు ఉండొచ్చు కాబట్టి అప్పటిదాకా నిర్ధారణకు రాలేం. హిట్ 3 ది థర్డ్ కేస్ తో పోటీ పడుతున్న రెట్రో కోసం పూజా హెగ్డే నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తోంది. పద్ధతైన చీరకట్టులో ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు బాగా రీచ్ అవుతున్నాయి. ఇది రెట్రోకు మంచి పబ్లిసిటీగానూ పనికొస్తోంది. మేకప్ లేకుండా సహజమైన లుక్స్ తో కనిపించడం వైరలవుతోంది. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో మంచి రిలీజ్ దక్కనుంది.
This post was last modified on April 19, 2025 10:03 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…