స్టార్ ఇమేజ్ ఉన్న ప్రతి హీరో పాన్ ఇండియా రేంజికి ఎదిగిపోవాలనే ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం. కొందరు హీరోలకు అనుకోకుండా కలిసి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించేశారు. మిగతా హీరోలు కూడా వారిలా ఎదిగిపోవాలని ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ తమిళంలో కాస్త ఫాలోయింగ్ ఉన్న నేచురల్ స్టార్.. కొన్నేళ్ల నుంచి తన చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిలో రీచ్ పెంచడానికి పయత్నిస్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఈ చిత్రాలన్నీ బహు భాషల్లో ప్రకటించినవే. కానీ రిలీజ్ టైం దగ్గర పడేసరికి తెలుగులో మాత్రమే అవి ప్రభావం చూపాయి. ‘సరిపోదా శనివారం’ తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది. మిగతా భాషల్లో రిలీజ్ నామమాత్రమే. కానీ నాని మాత్రం తన ప్రయత్నం ఆపట్లేదు.
తన కొత్త చిత్రం ‘హిట్-3’ని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. నాని కెరీర్లో హీరోయిజం, అలాగే వయొలెన్స్ పీక్స్‌లో ఉండబోతున్న సినిమాగా ‘హిట్-3’ కనిపిస్తోంది. హిట్ సిరీస్‌లో గత రెండు చిత్రాలూ ఓటీటీలో వివిధ భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. నాని గత చిత్రాలు కూడా ఓటీటీలో ఇలాగే మంచి ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ‘హిట్-3’కి ఇతర భాషల్లో కూడా కొంత డిమాండ్ ఉన్నట్లే కనిపిస్తోంది.
నాని ఇతర భాషల్లోనూ సినిమాను కొంచెం గట్టిగా పుష్ చేసి, రిలీజ్ సరిగా ప్లాన్ చేస్తే ‘హిట్-3’ పాన్ ఇండియా స్థాయిలో హిట్టయ్యే అవకాశముంది. ఈ సినిమా మీద నాని చాలా ధీమాగా ఉన్నాడు. హీరోయిజం వేరే లెవెల్లో ఉండే ఈ సినిమాతో తన స్టార్ ఇమేజ్ ఇంకా పెరుగుతుందని అతను నమ్మకంతో ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని స్వయంగా నిర్మించిన ఈ చిత్రం.. మే 1న విడుదల కాబోతోంది. నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో కథానాయికగా నటించింది. ఈ చిత్రం వంద కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం.
This post was last modified on April 18, 2025 2:39 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…