Movie News

టాలెంట్ ఉంది.. కానీ క్యారెక్టర్?

షైన్ టామ్ చాకో.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ‘దసరా’ చిత్రంలో అతడి పాత్ర, నటన మనవాళ్లకు విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సహా పలు చిత్రాల్లో నటించి తెలుగులో బాగా పాపులర్ అయ్యాడతను. పాత్ర ఎలాంటిదైనా ఒక నటుడిని చూడగానే ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ కలగడం అందరి విషయంలో జరగదు. ఈ ప్రత్యేకత టామ్ చాకో లాంటి విలక్షణ నటులకే సొంతం. కెరీర్ ఆరంభంలో ప్రకాష్ రాజ్ సైతం ఇలాంటి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఐతే టామ్‌లో టాలెంట్‌కు కొదవ లేదు. సైకో క్యారెక్టర్లను పండించడంలో అతడి నైపుణ్యమే వేరు.

స్వతహాగా మలయాళ నటుడైనప్పటికీ ఇప్పుడు తెలుగు, తమిళంలో బోలెడన్ని అవకాశాలు అతడి చేతిలో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని నటుడిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం షైన్‌కు ఉంది. కానీ అతడికి అలాంటి ఉద్దేశాలేమీ ఉన్నట్లు కనిపించడం లేదు. తెర మీదే తాను చేసే పాత్రల తరహాలోనే నిజ జీవితంలో కొంచెం తేడా అనే పేరు టామ్‌కు మొదట్నుంచి ఉంది. సహచర ఆర్టిస్టులతో తప్పుగా ప్రవర్తించడం.. స్టేజ్ మీద అతి చేయడం.. ఇంటర్వ్యూల్లో హద్దులు మీరి ప్రవర్తించడం.. ఇలా అతడితో ముడిపడ్డ వివాదాలు ఎన్నో.

ఇవన్నీ చాలవన్నట్లు డ్రగ్స్‌తో ముడిపడి తన పేరు పలుమార్లు వివాదాల్లోకెక్కింది. సినిమా సెట్స్‌లో డ్రగ్స్ సేవించినట్లు కూడా తనపై ఆరోపణలున్నాయి. తాజాగా అతను ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటుండగా.. పోలీసులు రైడ్ చేయడం, అతను హడావుడిగా పారిపోవడం.. సదరు వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో షైన్ పేరు మార్మోగుతోంది. ఇంత మంచి నటుడికి ఈ వంకర బుద్ధులేంటి.. ఎప్పుడూ మీడియా ఫోకస్ ఉంటుందని తెలిసీ ఈ విపరీత ప్రవర్తన ఏంటి.. డ్రగ్స్ గురించి యువతను మేల్కొల్పాల్సిన స్థితిలో ఉండి ఇవేం పనులు అంటూ అతడి మీద మండిపడుతున్నారు నెటిజన్లు.

This post was last modified on April 18, 2025 10:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆగకుండా ఆగమాగం చేస్తున్న దురంధర్

దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…

6 hours ago

సహానా సహానా… అంచనాలు అందుకున్నానా

రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…

7 hours ago

షర్మిలకు బాబు, పవన్, లోకేష్ విషెస్… మరి జగన్?

చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…

9 hours ago

‘సింపతీ కార్డ్’పై నాగవంశీ కౌంటర్

సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…

11 hours ago

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…

11 hours ago

కొత్త రిలీజుల తాకిడి… అవతారే పైచేయి

అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…

12 hours ago