కొత్త సినిమాలకు ఇప్పుడు థియేటర్లనే కాదు ఓటిటి వ్యూస్ లోనూ పోలికలు వస్తున్నాయి. కాకపోతే కొన్నిసార్లు ఈ ఫలితాలు ఊహించని విధంగా అనూహ్యంగా ఉంటాయి. ఇటీవలే ఏప్రిల్ 14న ఛావా, కోర్ట్ రెండూ ఒకేరోజు ఒకే నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫార్మ్ మీద స్ట్రీమింగ్ కి వచ్చాయి. బడ్జెట్, క్యాస్టింగ్, కంటెంట్ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే మొదటి వీకెండ్ లో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఛావా 5.9 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోగా కోర్ట్ దానికి ధీటుగా 5.4 మిలియన్ల వ్యూస్ తో గట్టి పోటీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఈ నెంబర్లలో అనూహ్య మార్పులు జరిగి నిర్మాత నాని సినిమానే నెంబర్ వన్ స్థానానికి దూసుకుపోయినా ఆశ్చర్యం లేదు.
రెండు సినిమాలు మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి. కాకపోతే ఛావాకు థియేట్రికల్ గా అంత భారీ స్పందన వచ్చినప్పుడు ఓటిటిలో అంతకు మించి వస్తుందని ఫ్యాన్స్ ఆశించడం సహజం. కానీ దానికి భిన్నంగా తక్కువ అంకెలు నమోదు కావడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఛావా 50 రోజుల తర్వాత డిజిటల్ బాట పట్టేసింది. అప్పటి దాకా ఓపిక పట్టలేని చాలా మంది లీకైన హెచ్డి ప్రింట్ లో పని కానిచ్చేశారు. కానీ కోర్ట్ అలా కాదు. కేవలం 28 రోజుల విండోతో ఓటిటికి వచ్చింది. సహజంగానే థియేటర్ కు వెళ్లని వాళ్ళు అధిక సంఖ్యలో ఉండటంతో దీనికి ప్రాధాన్యం ఇస్తున్న వైనం కనిపిస్తోంది.
ఈ కారణంగానే ఓటిటి నిర్మాతల మీద తక్కువ గ్యాప్ కోసం ఒత్తిడి తెస్తాయి. కావాలనే అధిక మొత్తాలను ఆఫర్ చేస్తాయి. ఇక కోర్ట్ విషయానికి వస్తే స్ట్రీమింగ్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంది. నిర్మాతగా నాని బ్రాండ్ మరింత పెరిగేందుకు ఇది దోహద పడుతోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ న్యాచురల్ స్టార్ మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. తను హీరోగా నటించినా, ప్రొడ్యూసర్ గా వ్యవహరించినా వెంటనే కొనేందుకు పోటీ పడుతోంది. దసరా నుంచి మొదలైన ఈ బంధం తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో ఇంకా బలపడి ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ తో కొనసాగుతోంది. నాని బ్రాండ్ అలాంటిది మరి.
This post was last modified on April 18, 2025 10:30 am
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…