ఏ ముహూర్తంలో ‘పోకిరి’ రీ రిలీజ్ భారీ వసూళ్లు సాధించిందో ఇక అప్పటినుంచి రీ రిలీజుల ప్రహసనం నిరంతరం కొనసాగుతూనే ఉంది. నెలకు కనీసం రెండు మూడు నుంచి గరిష్టంగా అయిదారు పాత సినిమాలను రీ మాస్టరింగ్ పేరుతో థియేటర్లలోకి వదులుతున్నారు. చూసేవాడు చూస్తాడు లేనివాడు మానుకుంటాడని సింపుల్ గా చెప్పొచ్చు కానీ వీటి ప్రభావం కొత్త వాటి మీద పడుతుందనే చేదు వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఇప్పటిదాకా అయిదారుసార్లు వచ్చిన ‘ఒక్కడు’ని మళ్ళీ తీసుకొచ్చినా హైదరాబాద్ లో పది లక్షల దాకా గ్రాస్ నమోదు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడో వచ్చే ‘అతడు’కి ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు.
ఇప్పుడే కాదు గతంలో ఆరంజ్, ఓయ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటివి వచ్చినప్పుడు కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఉదయం షోలు వీటికేమో హౌస్ ఫుల్స్ పడిపోయి కొత్త సినిమాలకు ఉదయం ఆటకే జనాలు లేని దాఖలాలు చాలా ఉన్నాయి. ఒక ప్రణాళిక లేకుండా తోచిన వెంటనే రీ రిలీజులకు సిద్ధమైపోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఆ మధ్య ‘హిట్లర్’ కోసం ఇలాగే హడావిడి చేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ టీమ్ బోలెడు కబుర్లు పంచుకుంది. రేపు రిలీజ్ అనగా జనాలు లైట్ తీసుకున్నారని గుర్తించి ఆపేశారు. తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా హిట్లర్ ఊసే లేకుండా పోయింది.
క్లాసిక్ అని చెప్పుకునే ‘ఆదిత్య 369’కి ఎంత మంచి మార్కెటింగ్ చేసినప్పటికీ భాగ్యనగరం మినహాయించి బయట ఏమంత వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ‘నాయక్’ కు ఎర్లీ మార్నింగ్ ఒకటి రెండు షోలు తప్పించి చాలా చోట్ల వాష్ అవుట్ అయిపోయింది. వచ్చే వారం ‘భరత్ అనే నేను’ తెస్తున్నారు. మేలో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, యమదొంగలు రెడీ అవుతున్నాయి. ‘స్టాలిన్’ని జూన్ కోసం రెడీ చేస్తున్నారు. జనాలు థియేటర్లకు రావడం లేదని ఇండస్ట్రీ పెద్దలు వాపోతున్న తరుణంలో ఇలా మూకుమ్మడిగా రీ రిలీజులను కట్టడి చేసే పరిమితంగా వచ్చేలా చేస్తే బెటర్.
This post was last modified on April 18, 2025 3:21 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…
35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…
కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు…
దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…
ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…