అదిగో పులి ఇదిగో తోక తరహాలో సాగుతున్న ది రాజా సాబ్ నుంచి అప్డేట్స్ వచ్చి వారాలు నెలలు గడిచిపోతున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే టీజర్ రెడీ అవుతోందనే ఇండస్ట్రీ టాక్ వాళ్లలో ఆశలు చిగురించేలా చేస్తున్నప్పటికీ అదొక్కటే సరిపోదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. అసలైన రిలీజ్ డేట్ సంగతి తేల్చమని డిమాండ్ చేస్తున్నారు. 2025లో ఖచ్చితంగా వస్తుందనుకుంటే ఏ తేదీకో చెప్పాలని కోరుతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాస్ తిరిగి రాగానే టీజర్ కు డబ్బింగ్ చెప్పించేసి ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి మాట్లాడబోతున్నారు.
అనుకున్నంత ఈజీగా రాజా సాబ్ రిలీజ్ డేట్ తేలదు. ఎందుకంటే బ్యాలన్స్ పాటల షూటింగ్ ఎప్పటిలోగా పూర్తి చేయాలి, పెండింగ్ ఉన్న టాకీ పార్ట్ కి ఎంత సమయం అవసరమవుతుందనే దాని మీద దర్శకుడు మారుతీ కసరత్తు అయితే చేశారు కానీ ప్రభాస్ కాల్ షీట్లు వరసగా దొరకడమే పెద్ద ఛాలెంజ్. సమాంతరంగా జరుగుతున్న ఫౌజీని ఆలస్యం చేసే ఉద్దేశంలో డార్లింగ్ లేడు. అయితే రాజా సాబ్ జాప్యం వెనుక వివిధ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. వాటిని టీజర్ కొంతవరకు అడ్డుకోగలదు కానీ పూర్తి స్థాయిలో కాదు. ఆ తర్వాత కథ మళ్ళీ మొదటికే వస్తుంది.
ఇవన్నీ విశ్లేషించుకుంటే ది రాజా సాబ్ దసరాకు రావడం అసాధ్యమే. ఎలాగూ కాంతార 2, అఖండ 2, సంబరాల ఏటి గట్టు, ఇడ్లీ కడాయ్ ఉన్నాయి కాబట్టి ఆ సీజన్ ని వదిలేయాల్సిందే. దీపావళి మన టాలీవుడ్ కు వసూళ్ల పరంగా బెస్ట్ సీజన్ కాదు. తర్వాత మిగిలిన ఆప్షన్ డిసెంబర్. సినిమా బాగుంటే సలార్ తరహాలో వర్కౌట్ చేసుకోవచ్చు. తిరిగి సంక్రాంతికి క్రేజీ సినిమాలున్నాయి కనక ఆలోగా మొత్తం రాబట్టేయాలి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన రాజా సాబ్ లో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ పాటల మీద మళ్ళీ వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ బ్యాలన్స్ ఉన్న వాటిలో ముఖ్యమైనవి ఇవే.
This post was last modified on April 18, 2025 7:39 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…