Movie News

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన స్థాయి ఆల్బమ్స్ రావడం లేదనేది వాస్తవమే. ఛావా, పొన్నియిన్ సెల్వన్ హిట్టయినా వాటిలో వింటేజ్ రెహమాన్ వినిపించలేదన్నది మ్యూజిక్ లవర్స్ కంప్లయింట్. ఇదిలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజిత్ ఇటీవలే రెహమాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. గాయని గాయకులకు బదులు రెహమాన్ టెక్నాలజీ వాడుతున్నాడని, దానివల్ల ఎందరో ఉపాధి కోల్పోవడమే కాక ఒరిజినాలిటీ తగ్గుతోందని వాపోయారు. దీనికి స్పందించకుండా మౌనంగా ఉన్న రెహమాన్ తాజాగా ఓపెనయ్యారు.

ఆయన మాటల సారాంశం చూస్తే ఎంత చెంపపెట్టు సమాధానమో అర్థమవుతుంది. దుబాయ్ వేదికగా రెహమాన్ ఒక మహిళా ఆర్కెస్ట్రా ట్రూప్ ని ఏర్పాటు చేశారు. అందులో అరవై దాకా సభ్యులు ఉన్నారు. నిత్యం కొత్త సంగీతం సృష్టించడంలో నిమగ్నమవ్వడం, మెళకువలు నేర్చుకోవడంతో పాటు కన్సర్ట్స్ లో పాలు పంచుకోవడం వీళ్ళ బాధ్యత. ఇందుకు గాను నెల నెలా రెహమాన్ జీతాలు చెల్లిస్తున్నారు. ఛావా లాంటి గ్రాండియర్స్ కి రెండు వందల మందికి పైగా కంపోజింగ్, రికార్డింగ్ లో భాగం వహిస్తారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కాని సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటు రెహమాన్ కు లేదు.

సో అభిజిత్ చేసిన కామెంట్లకు రెహమాన్ నుంచి ధీటైన సమాధానం వచ్చినట్టే. ఈ అభిప్రాయభేదం వెనుక కారణం లేకపోలేదు. లాల్ సలాం కోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడి చనిపోయిన గాయకుల గాత్రాన్ని రీ క్రియేట్ చేసిన రెహమాన్ ఆ విషయంగా కొన్ని విమర్శలు అందుకున్నాడు. వాళ్లలో అభిజిత్ ఉండటం ఫైనల్ ట్విస్ట్. ఇదంతా ఎలా ఉన్నా అతని మీద తనకు చాలా గౌరవం ఉందని. అది ఎప్పటికీ తగ్గదని, స్వీట్స్ కూడా పంపిస్తానని రెహమాన్ చెప్పడం చూస్తే ఈ టాపిక్ కి ఇంతటితో చెక్ పడినట్టే అనుకోవాలి. రామ్ చరణ్ పెద్దికి మ్యూజిక్ ఇస్తున్న రెహమాన్ మీద మెగా ఫ్యాన్స్ బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. 

This post was last modified on April 16, 2025 7:13 pm

Share

Recent Posts

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

49 minutes ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

1 hour ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

2 hours ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

3 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

3 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

4 hours ago