ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి ఇలాగే ఉంది. అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ చేసినప్పుడు తన మీద చాలా కామెంట్స్ వచ్చాయి. విదేశాల హ్యాంగోవర్ నుంచి బయటికి రాడని అందువల్లే ఫ్లాప్ పడిందని కాస్త ఘాటు విమర్శలే అందుకున్నాడు. వాటికి సమాధానం ధనుష్ ‘సార్’ రూపంలో ఇచ్చేశాడు. ఒక తమిళ హీరోతో తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసి రెండు లాంగ్వేజెస్ లో హిట్టు కొట్టడం చిన్న విషయం కాదు. ఈ విజయమే దుల్కర్ సల్మాన్ ని ‘లక్కీ భాస్కర్’ ఒప్పించేలా చేసింది. దీని సక్సెస్ థియేటర్ నుంచి నెట్ ఫ్లిక్స్ దాకా మారుమ్రోగిపోయింది.
ప్రస్తుతం ‘సూర్య 46’ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ అట్లూరి మరోసారి సితార బ్యానర్ కే పని చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్, క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. రెట్రో రిలీజయ్యాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడొచ్చు. దీని తర్వాత అజిత్ తో ఒక సినిమా సెట్ అయ్యేందుకు వెంకీ అట్లూరికి దారులు తెరుచుకున్నాయని కోలీవుడ్ టాక్. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ఫామ్ లోకి వచ్చేసిన అజిత్ యువ దర్శకులతో పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ప్రస్తుతానికి కథ చెప్పడం లాంటివేవీ జరగలేదు కానీ స్టోరీ ఉంటే కలవమనే సంకేతం అయితే అజిత్ నుంచి వచ్చిందని వినికిడి.
సైలెంట్ గా టాప్ లీగ్ లోకి దూసుకుపోతున్న వెంకీ అట్లూరికి చాలా కాలంగా చిరంజీవి ఆఫర్ కూడా పెండింగ్ లో ఉంది. సరైన కథ కుదిరితే ఈ ఇద్దరి కాంబో సాధ్యమవుతుందని ఆ మధ్య నిర్మాత ఒక ఇంటర్వ్యూలో చెప్పడం మెగా ఫ్యాన్స్ బాగా షేర్ చేసుకున్నారు. ఇలా ఒకొక్కటి టాప్ స్టార్లతో చేసుకుంటూ పోతే కెరీర్ చక్కగా సెటిలవుతుంది. ఫారిన్ సెటప్ కన్నా రూటెడ్ స్టోరీస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్న వెంకీ అట్లూరి ఈ కారణంగానే క్లాసు మాస్ ఇద్దరినీ మెప్పించగలుగుతున్నాడు. వీటితో కూడా హిట్టు కొడితే వెంకీ డిమాండ్ మాములుగా ఉండదు. అందుకేనేమో సితార మేకర్స్ తనను అస్సలు వదిలిపెట్టడం లేదు.
This post was last modified on April 15, 2025 4:59 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…