టాలీవుడ్లో హీరోల రేంజిని బట్టి స్టార్, సూపర్ స్టార్ అని విభజించి మాట్లాడేవారు. చిన్న, పెద్ద, మిడ్ రేంజ్ అనే పదాలు కూడా ఎప్పట్నుంచో వాడుకలో ఉన్నాయి. ఐతే గత కొన్నేళ్లలో సోషల్ మీడియా ప్రభావంతో కొన్ని కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. టైర్-1, టైర్-2, టైర్-3.. అని కొత్త విభజన మొదలైంది. వందల కోట్ల బడ్జెట్లు, వసూళ్లతో ముడిపడ్డ చిత్రాలు చేసే హీరోలను టైర్-1 అని.. అంతకంటే తక్కువ రేంజిలో ఉన్న వాళ్లను టైర్-2 అని.. మిగతా వాళ్లను టైర్-3 అని పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్.
ఈ లెక్కల ప్రకారం నేచురల్ స్టార్ నాని చాలా ఏళ్ల కిందటే టైర్-2లోకి వచ్చేశాడన్నది అభిమానుల అభిప్రాయం. ఐతే ‘దసరా’ నుంచి అతడి టార్గెట్ టైర్-1 మీద పడ్డట్లు చర్చ జరుగుతోంది. ‘హిట్-3’కి జరిగిన బిజినెస్, దీని వసూళ్ల మీద ఉన్న అంచనాలను బట్టి చూస్తే నాని టైర్-1కు దగ్గరైపోతున్నాడనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.
ఇదే విషయాన్ని ‘హిట్-3’ ప్రమోషనల్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తే.. నాని ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టైర్-1, టైర్-2, టైర్-3 అంటూ విభాగాలు పెట్టడం స్టుపిడిటీ అని తేల్చేశాడు నాని. ఈ మాట అనొచ్చో లేదో అంటూనే నాని ఈ కాన్సెప్టే ‘స్టుపిడ్’ అనేశాడు. ఈ ‘టైర్’ల గోలంతా మీడియాలోనే ఉంటుందని.. వాళ్లే దీన్ని క్రియేట్ చేశారని.. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారని.. నిజానికి ఒక హీరో నచ్చి సినిమా చూడడమే ముఖ్యమని, ఎవరి స్థాయిలో వాళ్లు సినిమాలు చేసుకుపోతుంటారని.. తానైతే ఇలాంటివి అస్సలు పట్టించుకోనని చెప్పాడు నాని.
ఇలా బోగీల మాదిరి విడదీసి చెప్పడం కరెక్ట్ కాదని.. ఈ ‘టైర్’ల గోల లేకపోతేనే ఇండస్ట్రీ బాగుంటుందని.. అది సినిమాకు మంచిదని స్పష్టం చేశాడు నాని. సోషల్ మీడియాలో ఈ టైర్-1, టైర్-2, టైర్-3 లాంటి మాటలు వాడి ఫ్యాన్ వార్స్ చేసేవాళ్లకు నాని గట్టిగానే సమాధానం ఇచ్చాడనే చెప్పాలి.
This post was last modified on April 15, 2025 11:52 am
నిజమే.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ)కి కార్యకర్తలు అంటే ప్రాణమే. విపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా... టీడీపీ వైఖరి ఇదే. సమకాలీన…
కెజిఎఫ్, సలార్ తో టాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరైన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మెగా ఫోన్ చేపట్టాడు. ఈయన డైరెక్షన్…
ఒకప్పుడు దక్షిణాదిన ఒక వెలుగు వెలిగిన నిర్మాతల్లో ఏఎం రత్నం ఒకరు. శ్రీ సూర్య మూవీస్ అనే బేనర్ కనిపిస్తే…
రాష్ట్రంలో `నాడు-నేడు` అనే మాట వినిపించగానే చటుక్కున జగనే గుర్తుకు వస్తారు. తన పాలన ప్రారంభం నుంచి ఆయన నాడు-నేడు…
ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా…