దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద కూడా భారీగానే అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్ పాత్రకు జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో అజయ్ దేవగణ్ పాత్రకు జోడీగా శ్రియ కనిపిస్తుందని అంటున్నారు.
ఈ ముగ్గురూ కాక ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా మరో అమ్మాయి కూడా కనిపించనుందట. ఆ పాత్ర తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో మంచి పేరు సంపాదించిన ఐశ్వర్యా రాజేష్‌ను వరించినట్లు సమాచారం.
తారక్ చేస్తున్నది గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్ర అన్న సంగతి తెలిసిందే. పాత్ర ప్రారంభ దశలో అతడికి మరదలి పాత్రలో ఓ గిరిజన యువతే కనిపించాల్సి ఉంటుందట. ఆ పాత్రకు ఐశ్వర్యను ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఈ పాత్ర పరిణామం చెందాక బ్రిటిష్ యువతితో ప్రేమలో పడేలా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
గిరిజన యువతి పాత్రకు ఐశ్వర్యా రాజేష్ పక్కాగా సూటవ్వడమే కాదు.. దక్షిణాది అన్ని భాషల వాళ్లకూ ఆమె పరిచయం ఉండటం సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నాడట రాజమౌళి. త్వరలోనే ఐశ్వర్య ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతోందట. అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. ముందు భీమ్ పాత్ర టీజర్ విజువల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. ఇంకో మూడు నెలల పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుంది. త్వరలోనే ఆలియా భట్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు రానుంది.
This post was last modified on November 1, 2020 6:35 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…