సినిమాల్లో గూఢచారులంటే ప్రేక్షకులకు భలే క్రేజు. సూపర్ స్టార్ కృష్ణ ‘గూఢచారి 116’తో మొదలుపెట్టి నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ దాకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఈ జానర్ నుంచి బోలెడు వినోదాన్ని పంచాయి . కానీ దీన్ని హ్యాండిల్ చేసే తీరు సరిగా లేకపోతే ఫలితం రివర్స్ కొడుతుంది. ఇటీవలే వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’లో సీక్రెట్ ఏజెంట్ కాన్సెప్ట్ బోల్తా కొట్టింది. సీరియస్ గా చెప్పాల్సిన పాయింట్ కి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హాస్యం జోడించే ప్రయత్నం చేయడం జనానికి నచ్చలేదు. అసలు రా సంస్థ పని చేసే తీరునే కామెడీ చూపించడం సహజత్వాన్ని తగ్గించేసి హిట్టయ్యే అవకాశాలు పోగొట్టింది.
ఈ అనుభవం సిద్దుకే కాదు ఇతరులకూ జరిగింది. అఖిల్ ‘ఏజెంట్’ ఎంత పెద్ద డిజాస్టరో గుర్తు చేయకపోతేనే బెటరంటారు ఫ్యాన్స్. అంతగా భయపెట్టింది. దీనికి జాక్ కి కొన్ని సారూప్యతలున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ ని సిల్లీగా చూపించి టెర్రరిస్టులతో ముడిపెట్టి దాని ద్వారా హీరోయిజం పండించాలని చూసిన వైనం దెబ్బేసింది. సుభాష్ చంద్రబోస్ అంతర్ధానం మీద నిఖిల్ చేసిన ‘స్పై’ తీవ్రంగా నిరాశపరచడమే కాక హీరోకు కథల ఎంపికలో ఒక హెచ్చరికగా నిలిచింది. వెన్నెల కిషోర్ సైతం ఈ విభాగంలో రెండు ప్రయత్నాలు చేసి దెబ్బ తిన్నాడు. మొదటిది ‘ఛారి 111’ వచ్చిన సంగతే గుర్తు లేకపోగా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ తడబడి సూపర్ ఫ్లాప్ అయ్యింది. అడవి శేష్ ‘గూఢచారి’ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కావడం గుర్తు చేసుకోవాలి.
దీనికి కారణం సింపుల్. డీవియేషన్ లేకుండా టైట్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు కథనాన్ని పరుగులు పెట్టించడం. అందుకే ‘గూఢచారి 2’ కి డిమాండ్ పెరిగింది. అప్పుడెప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం చిరంజీవి జాక్ లాంటి ప్రయోగాలు ‘చంటబ్బాయి’ రూపంలో చేశారు కానీ ఆ టైంలో ఇది కూడా ఫ్లాపే. ఒకరకంగా చెప్పాలంటే ఈ గూఢచారి ఫార్ములా కత్తి మీద సాము లాంటిది. ఏ మాత్రం తేడా కొట్టినా కసుక్కున మెడ కట్ చేస్తుంది. సరిగ్గా వాడుకున్నామా కలెక్షన్ల రూపంలో పూలమాల వేస్తుంది. సో జాగ్రత్తుగా పట్టుకోకపోతే నష్టపోయేది నిర్మాత ఒక్కడే కాదు, కెరీర్ పరంగా హీరో, దర్శకుడు కూడా. అందుకే స్క్రిప్ట్ దశలోనే ఒకటికి పదిసార్లు చెక్ చేయాలి.
This post was last modified on April 13, 2025 7:58 am
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…
తమిళ స్టార్ హీరో సూర్యకు ఎంతో కీలకమైన సినిమా.. రెట్రో. కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. తన చివరి చిత్రం…
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డులు సృష్టించిన పుష్ప 2…
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ…