ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2 గంటల 35 నిమిషాల నిడివితో ఏ సర్టిఫికెట్ తెచ్చుకుని ప్రమోషన్లకు రెడీ అవుతోంది. నాని నిర్మాతగా ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టిన ప్యాన్ ఇండియా మూవీగా అభిమానుల్లో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ డిజాస్టర్ నుంచి కోలుకుని తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. టీజర్ చూశాక హైప్ పెరిగింది కానీ అబ్ కి బార్ అర్జున్ సర్కార్ గా వచ్చిన ఆడియో సాంగ్ ఇంకా రీచ్ తెచ్చుకునే పనిలో ఉంది. సంగీతం సంగతలా ఉంచితే అసలు విషయాలు వేరే ఉన్నాయి.
ఇన్ సైడ్ ప్రకారం హిట్ 3 వయొలెన్స్ మోతాదు చాలా ఎక్కువగా ఉందట. హిట్ 1, హిట్ 2 లో సైకో చేసే హత్యలు చూశాం కానీ ఇప్పుడు మాత్రం హీరో చేయబోయే ఊచకోతకు నేరస్థులు బలయ్యే ఎపిసోడ్లు ఒళ్ళు గగుర్పొడిచేలా వచ్చాయట. టీజర్ లో చూపించింది కేవలం సాంపిల్ మాత్రమేనని ట్రైలర్ వచ్చాక నేషనల్ వైడ్ ఇదో హాట్ టాపిక్ అయ్యేలా విజువల్స్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటిదాకా సౌత్ ఇండియాకు సంబంధించి మార్కోనే విపరీతమైన హింస ఉన్న సినిమాగా పేరు గాంచింది. దానికి పోటీ ఇచ్చేలా హిట్ 3 ఉంటుందని వినికిడి. అది నిజమో కాదో రేపు ట్రైలర్ లాంఛ్ తర్వాత తెలిసిపోతుంది.
హిందీతో పాటు ఇతర భాషల్లో మార్కెట్ ని పెంచుకునే క్రమంలో నాని హిట్ 3ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. పోటీలో సూర్య రెట్రో ఉండటంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఈ క్రైమ్ డ్రామాలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మాములుగా అమ్మాయిలను హత్య చేసే సైకో కథలనే ఇప్పటిదాకా చూశాం కానీ హిట్ 3 లో మాత్రం రివర్స్ లో మర్డర్ చేసినవాళ్లను అంతకంటే కిరాతకంగా మట్టుబెట్టే అర్జున్ సర్కార్ ని చూస్తామట. ఈ స్థాయిలో ఊరిస్తున్నారంటే నాని ఏదో పెద్ద ప్లానింగ్ తో రాబోతున్నాడని అర్థమవుతోందిగా.
This post was last modified on April 13, 2025 9:53 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…