Movie News

రాముడి పాట….అభిమానులు హ్యాపీనా

గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేసింది. హడావిడి లేకుండా గుళ్లో జరిగిన పూజా కార్యక్రమంలో టీమ్ మెంబెర్స్ లాంచ్ పూర్తి చేశారు. చాలా గ్యాప్ తర్వాత శంకర్ మహదేవన్ పాడటం మ్యూజిక్ లవర్స్ లో అంచనాలు రేపింది. ఆస్కార్ విజేత కీరవాణి ముప్పై సంవత్సరాల తర్వాత మెగాస్టార్ మూవీకి కంపోజ్ చేశారు. ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పి పరశురామ్ తర్వాత మళ్ళీ ఈ కలయిక ఇప్పుడు సాధ్యపడింది. సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి.

వినగానే ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా ఉండటంతో పాటు చిరుని అందంగా చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది కానీ నిజానికి ఈ సాంగ్ గురించి ఫ్యాన్స్ ఊహించింది వేరని చెప్పాలి. కోటి స్వరకల్పనలో అల్లుడా మజాకాలో మా ఊరి దేవుడు అందాల రాముడు టైపులో ,మంచి హుషారు మిక్స్ చేసిన పాట ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అంత మోతాదులో కీరవాణి ఇవ్వలేదు. కథలో సందర్భానికి తగట్టు ఇలాంటి ట్యూన్ ఇచ్చారేమో కానీ ఒకవైపు సంతోషం, ఇంకోవైపు ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలగలిసి మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. సెట్ వర్క్, కొరియోగ్రఫీ బాగానే ఉన్నా రీచ్ ఎంత వస్తుందో వేచి చూడాలి.

విడుదల తేదీ గురించి సందిగ్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విశ్వంభర ఇలా పబ్లిసిటీ పర్వానికి తెరతీయడం సానుకూల సంకేతమే. జూలై 24 డేట్ లీకైనప్పటికీ యువి నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. బహుశా ట్రైలర్ లో ప్రకటిద్దామని చూస్తున్నారో ఏమో తెలియాల్సి ఉంది. భోళా శంకర్ తర్వాత కోరిమరీ గ్యాప్ తీసుకున్న చిరంజీవికి విశ్వంభర ఫలితం చాలా కీలకం. జగదేకవీరుడు అతిలోకసుందరి., అంజి తర్వాత తాను దూరంగా పెట్టేసిన ఫాంటసీ జానర్ ని ఇంత గ్యాప్ తర్వాత టచ్ చేశారు. బింబిసార తర్వాత ఏకంగా మెగా మూవీ రావడంతో దర్శకుడు వసిష్ఠ సైతం బెస్ట్ ఇవ్వడానికే కష్టపడుతున్నాడు.

This post was last modified on April 12, 2025 2:58 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago