Movie News

నిన్న ఆరెంజ్…నేడు ఆర్య 2….రేపు ఆటోగ్రాఫ్ ?

మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో జరుగుతోంది. నిర్మాత నాగబాబుని ఏకంగా జీవితమే చాలనిపించేలా చేసిన ఆరెంజ్ గత ఏడాది అదిరిపోయే వసూళ్లతో వావ్ అనిపించడం చూశాం. ఆయన స్వయంగా థియేటర్లకెళ్ళి మరీ జరుగుతున్న రచ్చ చూసి ఆశ్చర్యపోయారు. ఇదేదో అప్పుడే చేసి ఉంటే నాకు నష్టాలు వచ్చేవి కాదని కూడా అన్నారు. ఇదే తరహా రెస్పాన్స్ సిద్దార్థ్ ఓయ్ కు కనిపించింది. ఇప్పడు వీటి బాటలోనే గత వారం వచ్చిన ఆర్య 2 మంచి క్లోజింగ్ తో రీ రిలీజ్ పూర్తి చేసుకుంది.

ట్రేడ్ రిపోర్ట్ మేరకు సుమారు అయిదు కోట్ల దాకా గ్రాస్ వచ్చిందని సమాచారం. ఇది ఒకరకంగా రికార్డే. ఎందుకంటే ఆర్య 2కి ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు. అల్లు అర్జున్, సుకుమార్ లు దీని గురించి ఎక్కడా బైట్ ఇవ్వడం కానీ, జ్ఞాపకాలు పంచుకోవడం కానీ చేయలేదు. సైలెంట్ గా వచ్చినా సరే అభిమానులు, మూవీ లవర్స్ హౌస్ ఫుల్స్ చేయించారు. ముఖ్యంగా మొదటి రెండు రోజులు మెయిన్ సెంటర్స్ జాతరని తలపించాయి. ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు సందర్భం రావడం కలిసి వచ్చింది. కొత్త రిలీజుల కంటే ఆర్య 2కే ఎక్కువ స్పందన రావడంలో ఐకాన్ స్టార్ ఇమేజ్ తో పాటు పుష్ప 2 ఎఫెక్టని చెప్పక తప్పదు.

తర్వాతి వరుసలో రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ ఉంది. ఇది కూడా ఫస్ట్ రిలీజ్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ కు నష్టాలు తెచ్చిందే. మాస్ మహారాజాని అంత సాఫ్ట్ ఎమోషనల్ లవ్ మూవీలో జనం చూడలేకపోయారు. కానీ కనెక్ట్ అయిన ఆడియన్స్ కి మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది. ముఖ్యంగా కీరవాణి పాటలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ వినేలా ఉంటాయి. సో ఆరంజ్, ఆర్య 2, ఓయ్ తరహాలో దీనికి కూడా కలెక్షన్లు వస్తాయని బయ్యర్లు భావిస్తున్నారు. మంచి క్వాలిటీతో రీ మాస్టరింగ్ చేయించడం ప్లస్ అవుతోంది. ఈ లెక్కన ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాపులు 2040లో రీ రిలీజ్ టైంలో హిట్టవుతాయేమో.

This post was last modified on April 9, 2025 1:44 pm

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

9 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

12 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

13 hours ago