అదేంటి రెండు ఆడేసి వెళ్ళిపోయిన సినిమాలు పరస్పరం కవ్వించుకోవడం ఏమిటని అనుకుంటున్నారా. అసలు మ్యాటర్ వేరే ఉంది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజై పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో ఆల్ ఇండియా రికార్డు సాధించిన పుష్ప 2 ది రూల్ ఈ ఆదివారం ఏప్రిల్ 13 శాటిలైట్ ప్రీమియర్ జరుపుకోనుంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో ఉన్నప్పటికీ బుల్లితెరపై మొదటిసారి కాబట్టి చూసే వాళ్ళ సంఖ్య భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో టిఆర్పిలో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమని స్టార్ మా ఛానల్ తో పాటు ఐకాన్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చి పడింది.
పుష్ప 2 ప్రీమియర్ కానున్న సమయంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని రెండోసారి టెలికాస్ట్ చేస్తోంది జీ తెలుగు. అంటే పోటీకి కవ్విస్తున్నట్టే. ఆల్రెడీ ఒకసారి వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదనుకోవడానికి లేదు. ఎందుకంటే వెంకీ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ లో మాములు పుష్ లేదు. పైగా మొదటిసారి ప్రసారం టైంలో పండగ, క్రికెట్ మ్యాచ్ లాంటి బ్రేకులు తగిలాయి. అయినా సరే టిఆర్పి భారీగా వచ్చింది. ఈసారి అలాంటి అవరోధాలు ఏవీ లేవు కనక స్పందన దానికి మించి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2కి ఎంతో కొంత ప్రభావమైతే ఖచ్చితంగా ఉంటుంది.
థియేటర్లలోనే అనుకుంటే ఇలా టీవీ తెరలపై కూడా పోటీ ఉండటం విచిత్రమే. ఓటిటిల ఉదృతి పెరిగాక శాటిలైట్ ఛానల్స్ కు సినిమాల ద్వారా ఆదాయం రావడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ప్రీమియర్ సమయానికి లక్షలాది ఆడియన్స్ ఓటిటితో పాటు ఇతరత్రా మార్గాల్లో కొత్త చిత్రాలు చూసేస్తున్నారు. దీని వల్ల యాడ్స్ తో పాటు ప్రసారమయ్యే ఛానల్స్ లో చూసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పడు 20 పైనే టిఆర్పి సాధించే బ్లాక్ బస్టర్లు ఇప్పుడు 10 దాటేందుకు కిందా మీద పడుతున్నాయి. మరి పుష్ప 2 ది రూల్ ఏదైనా కొత్త నెంబర్లు నమోదు చేసి అల వైకుంఠపురములోని దాటుతుందేమో చూడాలి.
This post was last modified on April 8, 2025 9:32 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…