వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్న నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్దిల గురించే అందరూ మాట్లాడుతున్నారు కానీ వీటికన్నా వారం ముందు మార్చి 19 రాబోతున్న టాక్సిక్ ని తక్కువంచనా వేస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఏడు రోజుల గ్యాప్ ఉన్నా సరే యష్ ని సులభంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఉత్తరాది మార్కెట్ లో కెజిఎఫ్ పుణ్యమాని యష్ కు భారీ డిమాండ్ ఉంది. ఆ కారణంగానే బాలీవుడ్ నుంచి కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవడం ద్వారా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెలివైన ఎత్తుగడ వేశారు.
గతంలో వచ్చిన టాక్సిక్ టీజర్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చిన నేపధ్యంలో ముందస్తుగా దాని మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో అర్థం కాని అయోమయం బయ్యర్ వర్గాల్లో ఉంది. అయితే యష్ పుట్టినరోజు కోసం ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి హడావిడిగా కట్ చేసిన వీడియో తప్ప అసలు కంటెంట్ కు దానికి సంబంధం లేదని బెంగళూరు రిపోర్ట్. ఎవరూ ఊహించనంత యాక్షన్ విజువల్స్ తో టాక్సిక్ రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. నయనతార పాత్రకు సైతం చాలా ప్రాధాన్యం ఉంటుందని, తనకు హీరోకు మధ్య ఉన్న బాండింగ్ కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుందని అంటున్నారు
సో నార్త్ స్టేట్స్ లో టాక్సిక్ నుంచి ప్యారడైజ్, పెద్దిలకు ఆషామాషీ పోటీ అయితే ఉండదు. ఒకవేళ యష్ మూవీ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే దానికి ధీటుగా రామ్ చరణ్, నానిలు మెప్పించాల్సి ఉంటుంది. పుష్ప 2 పంపిణి చేసిన అనిల్ తదానినే టాక్సిక్, పెద్దిలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే వార్త మరో ఆసక్తికరమైన విషయం. ఇక్కడితో అయిపోలేదు. మార్చి 21 రన్బీర్ కపూర్ – సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ సైతం రెడీ అంటోంది. ఇంకా చాలా టైం ఉంది కనక ఎవరెవరు తప్పుకుంటారు ఎవరు మాట మీద ఉంటారనేది ఇప్పుడే చెప్పలేం కానీ మొత్తానికి రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.
This post was last modified on April 7, 2025 6:13 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…