పెద్ది టీజర్ వచ్చాక ఎన్నో టాపిక్స్ మీద చర్చ జరుగుతోంది. దీనికి ప్యారడైజ్ కి రిలీజ్ డేట్ల క్లాష్ గురించి బయ్యర్లలో అప్పుడే ఆందోళన మొదలవ్వగా మ్యూజిక్ లవర్స్ డిస్కషన్ మరో అంశం మీదుంది. అదేంటో కొంచెం డీటెయిల్డ్ గా వెళ్తే అర్థమవుతుంది. గత కొంత కాలంగా ఏఆర్ రెహమాన్ స్థాయి సంగీతం కొత్త సినిమాల్లో వినిపించడం లేదన్నది వాస్తవం. యువకుడిగా ఉన్నప్పుడు రోజా, బొంబాయి, ప్రేమికుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లెక్కలేనన్ని ఇచ్చిన ఈ లెజెండరీ మ్యుజిషియన్ ఇప్పుడు 58 వయసులో డీసెంట్ ట్రాక్స్ తప్ప బెస్ట్ ఇవ్వలేకపోతున్నారనేది చేదు నిజం. పొన్నియిన్ సెల్వన్ కన్నా ఉదాహరణ అక్కర్లేదు.
కానీ పెద్ది టీజర్ లో అసలైన రెహమాన్ బిజిఎం రూపంలో వినిపించాడు. బుచ్చిబాబు కొంచెం ఎక్కువ సతాయించడం వల్లే ఇంత అవుట్ ఫుట్ వచ్చిందనేది మెగా కాంపౌండ్ లోపల వినిపిస్తున్న మాట. అదే నిజమైన పక్షంలో మూడు గంటల కంటెంట్ కి ఇలాంటి వర్క్ రాబట్టుకోవడం బుచ్చికి ముళ్ళమీద నడిచినట్టే. ఇంకోవైపు ది ప్యారడైజ్ కి సంగీతమిస్తున్న అనిరుధ్ రవిచందర్ భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. తన ఏజ్ 34. రజినీకాంత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ కెరీర్ బెస్ట్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. పని రాక్షసుడిగా పేరున్న శ్రీకాంత్ ఓదెల ఇతన్నుంచి ఎలాంటి ట్యూన్స్, బీజీఎమ్ రాబట్టుకుంటాడో వేరే చెప్పనక్కర్లేదు.
సో ఇప్పుడు రుజువు చేసుకోవాల్సింది రెహమనే కానీ అనిరుద్ కాదనేది సినీ ప్రియుల అభిప్రాయం. అసలే ఏదో మురారి శాపం లాగా ఆయనకు టాలీవుడ్ లో స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ లేదు. ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాల్సిన బరువు కూడా బుచ్చిబాబు మీద ఉంది. పదే పదే మార్పులకు రెహమాన్ అంత సులభంగా ఒప్పుకోరనే టాక్ కోలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. గతంలో చిరంజీవి సైరా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిన రెహమాన్ ఇప్పుడు రామ్ చరణ్ కు మర్చిపోలేని పాటలు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరిక. మళ్ళీ ఈ కలయిక సాధ్యపడుతుందో లేదో కనక ఎవర్ గ్రీన్ అనిపించుకునే ఆల్బమ్ ఇవ్వాల్సిన బాధ్యత లెజెండరీదే.
This post was last modified on April 6, 2025 11:58 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…