Movie News

ఆర్య 2 మీద పుష్ప 2 ప్రభావం

ఈ రోజు ఆర్య 2 రీ రిలీజ్ జరిగింది. అసలు విడుదల టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ సినిమాని ఆరంజ్ లాగే మూవీ లవర్స్ కల్ట్ గా భావిస్తారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో పాత రిలీజుల ట్రెండ్ తిరిగి ఊపందుకోవడంతో ఆర్య 2కి మంచి స్పందన వస్తుందనే ఉద్దేశంతో నిర్మాతలు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని పది రోజుల క్రితమే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పుష్ప 2కి దీనికి కనెక్షన్ ఏముందనే పాయింట్ కొద్దాం. గత డిసెంబర్ లో జరిగిన సంధ్య థియేటర్ దుర్ఘటన బన్నీతో పాటు అభిమానులు అంత సులభంగా మర్చిపోయేది కాదు.

ఇవాళ అదే థియేటర్ ప్రాంగణంలో ఆర్య 2 వచ్చింది. భారీ ఎత్తున బౌన్సర్లను పెట్టిన సంధ్య యాజమాన్యం ప్రతి ఒక్కరిని చెక్ చేయించి లోపలికి పంపించింది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి రద్దీ ఏర్పడకుండా చర్యలు తీసుకుని గుంపులుగా ఉన్న ఫ్యాన్స్ ని చెదరగొట్టి విడివిడిగా వెళ్లాలని సూచించారు. హాలు లోపలికి ఎలాంటి సామాగ్రిని అనుమతించలేదు. పుష్ప 2 గాయం గుర్తున్న కొందరు దాన్ని మర్చిపోయేలా స్థాయిలో సెలెబ్రేట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ ముందస్తు జాగ్రత్తల వల్ల అవేవి లేకుండా ప్రశాంతంగా షోలు జరుగుతున్నాయి. ఒక రీ రిలీజ్ కు ఇంత సెక్యూరిటీ గతంలో ఎప్పుడూ లేదు.

అడ్వాన్స్ బుకింగ్ లో సుమారు రెండు కోట్ల దాకా ఆర్య 2 వసూలు చేసిందని ట్రేడ్ రిపోర్ట్. ఇంకా అఫీషియల్ నెంబర్స్ రావాల్సి ఉంది. గత వారం నాయక్, నిన్న ఆదిత్య 369కి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆర్య 2కూ అలాగే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆర్య 2 దానికి భిన్నంగా హౌస్ ఫుల్స్ నమోదు చేస్తోంది. చాలా చోట్ల షోలు సోల్డవుట్ అయ్యాయి. పుష్ప 2 తర్వాత బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ కొత్త సినిమా రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ఆర్య 2నే ఒక మంచి జ్ఞాపకంగా మలచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

This post was last modified on April 5, 2025 3:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

4 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

4 hours ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

5 hours ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

6 hours ago

తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఇదా?

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…

6 hours ago

రవితేజ-శ్రీలీల.. మళ్లీ ఫైరే

మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…

7 hours ago