Movie News

వ్యాపారాన్ని నిర్ణయించబోయే ‘పెద్ది’ షాట్

రేపు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది టీజర్ విడుదల చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బకు తీవ్ర నిరాశలో ఉన్న మెగాభిమానులు దీని మీద గంపెడాశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే మొన్నోసారి నిర్మాత వెయ్యిసార్లు చూడొచ్చంటూ పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. ఎన్నడూ లేనిది రామ్ చరణ్ చాలా స్పెషల్ గా దర్శకుడు బుచ్చిబాబుకి హనుమంతుడి భక్తిని చాటే కానుకలు పంపడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఇంత అభిమానం తను గతంలో శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ మీద కూడా చూపించలేదు. అంటే పెద్ది నిర్మాణంలోనే చరణ్ కు ఆ స్థాయిలో బుచ్చిబాబు మీద నమ్మకం వచ్చేసిందన్న మాట.

ఇప్పుడీ ఫస్ట్ షాట్ టీజరే పెద్ది వ్యాపారానికి తొలిమెట్టు కానుంది. సహజంగానే దీని మీద బజ్ ఉన్నప్పటికి ఏ మోతాదులో నమ్మకం పెట్టుకోవాలనే దాని మీద బయ్యర్లు కొంత అయోమయంలోనే ఉన్నారు. వాటికి కొంత సమాధానం రేపు దొరుకుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఎలా ఉంటుందనే శాంపిల్ కూడా ఇందులోనే వినబోతున్నాం. గేమ్ ఛేంజర్ ఫలితంతో సంబంధం లేకుండా పెద్దికి క్రేజ్ ఏర్పడుతుందనేది డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం. టైటిల్ మాస్ గా పెట్టడం, రంగస్థలం తర్వాత అంతకు మించి అనే స్థాయిలో గెటప్ డిజైన్ చేయడం ఇవన్నీ బిజినెస్ కోణంలో చూసుకుంటే సానుకూల అంశాలే.

విడుదల తేదీ వచ్చే ఏడాది మార్చిలో ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అది ఫస్ట్ షాట్ లో పొందుపరుస్తారా లేదా అనేది వేచి చూడాలి. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ తదితరులను రేపు రివీల్ చేయకపోవచ్చు. ఇంకా రిలీజ్ చాలా దూరంలో ఉంది కాబట్టి నెమ్మదిగా ప్రమోషన్ కంటెంట్ వదులుతారు. హక్కుల కోసం ఇప్పటికే డిమాండ్ ఉన్నా టీజర్ వచ్చాక రేట్లు మరింత ఎక్కువగా ఆఫర్ చేస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది. పెద్ది తర్వాత చేయబోయే సుకుమార్ సినిమాకు ఎక్కువ టైం పట్టేలా ఉంది కాబట్టి అంత గ్యాప్ కి న్యాయం చేకూరేలా శిష్యుడు బుచ్చిబాబు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే.

This post was last modified on April 5, 2025 2:54 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago