కేవలం అయిదే రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 10 రిలీజని వారాల కృత్రమే ప్రకటించినప్పటికీ ప్రమోషన్ల పరంగా మైత్రి ఆశించినంత వేగంగా వెళ్లలేకపోవడం ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. అయితే వీళ్ళను తప్పు పట్టేందుకు లేదు. ఎందుకంటే అజిత్ పబ్లిసిటీకి ఎప్పుడూ దూరమే. సినిమా బాగుంటే మనమేం చెప్పకపోయినా జనం థియేటర్లకు వస్తారనే ఫిలాసఫీ తనది. కానీ ఫ్యాన్స్ కు అలా నచ్చదు. తమ హీరో బయటికి రావాలి. ఈవెంట్లలో పాల్గొనాలి. హడావిడి చేయాలి. ఇంటర్వ్యూలు ఇస్తూ బోలెడు విశేషాలు పంచుకోవాలి. ఇవేవీ గుడ్ బ్యాగ్ అగ్లీ విషయంలో కొంచెం కూడా జరగడం లేదు.
నిన్న తమిళ వెర్షన్ ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్నీ పొందుపరిచినట్టు దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఈ వీడియో ద్వారా చెప్పేశాడు. యాక్షన్, కామెడీ, ఫన్, ఎలివేషన్ అన్నీ పెట్టాడు. జివి ప్రకాష్ కుమార్ బీజీఎమ్ మీద కామెంట్స్ ఉన్నప్పటికీ మొత్తం సినిమా చూశాకే దీని గురించి కామెంట్ చేయొచ్చు. తమిళంలో ఈ మూవీకి బజ్ అక్కర్లేదు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రిలీజ్ కు ముందే ప్రీ నెగటివ్ టాక్ తెచ్చుకున్న విడాముయార్చి లాంటి డ్రై కంటెంట్ కే వంద కోట్లకు పైగా వచ్చినప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ ఎంత చేస్తుందో వేరే చెప్పాలా. కానీ అసలు సమస్య తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఉంది.
మన దగ్గర అజిత్ మార్కెట్ ఏమంత బాగాలేదు. టాలీవుడ్ లో ప్రేమలేఖ, గ్యాంబ్లర్ లాంటి కాసిన్ని హిట్లు తప్ప తనవి కమర్షియల్ గా ఆడిన దాఖలాలు తక్కువ. తెగింపు, వలిమై లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తెలుగులో సూపర్ ఫ్లాప్ అయ్యాయి. మైత్రికేమో గుడ్ బ్యాడ్ ఆగ్లీని తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసుకునే ప్లాన్ లో ఉంది. కానీ అజిత్ నుంచి సహకారం కష్టమే. ఈవెంట్లకు రావడం దేవుడెరుగు కనీసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా గొప్పే. విజయ్, నయనతారలు కూడా ఇంతేనన్న సంగతి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ జాక్ తో పోటీ పడుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీకి ఇదే మైత్రి నిర్మించిన సన్నీ డియోల్ జాట్ కూడా కాంపిటీషన్ ఇస్తోంది.
This post was last modified on April 5, 2025 1:38 pm
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…