స్టార్ క్యాస్టింగ్ లేకుండా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దాని సీక్వెల్ జై హనుమాన్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. కాంతార చాప్టర్ 1 పూర్తి చేసుకుని రిషబ్ శెట్టి ఇటు రాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా తన పేరు మీద ప్రశాంత్ వర్మ సృష్టించిన సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఇతర దర్శకులతోనూ ప్యాన్ ఇండియా మూవీస్ చేయడం విదితమే. వాటిలో మొదటిది మహాకాళి. పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో రూపొందబోయే ఈ ఫాంటసీ డ్రామాకు ఆర్కెడి స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యగా వ్యవహరిస్తోంది. తాజాగా ఒక కీలక అప్డేట్ అంచనాలు పెంచేలా ఉంది.
ఇటీవలి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఛావాలో ఔరంగజేబుగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన అక్షయ్ ఖన్నా ఇప్పుడీ మహాకాళిలో భాగమవుతున్నాడు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇప్పుడంటే ఇలాంటి క్యారెక్టర్లకు వచ్చేశాడు కానీ వినోదా ఖన్నా వారసుడిగా ఒకప్పుడు తనకు బాలీవుడ్ లో మంచి సోలో హిట్స్ ఉన్నాయి. వాటిలో తాళ్ ముఖ్యమైంది. ఐశ్వర్య రాయ్ ప్రేమికుడిగా చాలా పేరు తెచ్చింది. జెపి దత్తా తీసిన రెండో మూవీ బోర్డర్ కూడా బ్లాక్ బస్టరే. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే చేశాడు కానీ సక్సెస్ రేట్ తగ్గిపోవడంతో ఫిజిక్ మీద దృష్టి వదిలేయడం అవకాశాలను తగ్గించింది.
ఇప్పుడీ మహాకాళి అక్షయ్ ఖన్నాకు టాలీవుడ్ తెరంగేట్రం. పాత్ర తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి చెప్పలేదు కానీ కథ ప్రకారం బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో తనే తెగ నాయకుడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. సెటిల్డ్ నటన ఇవ్వడంలో పేరున్న అక్షయ్ ఖన్నాను ప్రశాంత్ వర్మ, అపర్ణలు ఎలా వాడుకుంటారో చూడాలి. హనుమాన్ తో మొదలుపెట్టి వివిధ స్టోరీలను యునివర్స్ లో భాగం చేస్తున్న ప్రశాంత్ వర్మ ఇవన్నీ అయ్యాక అవెంజర్స్ రేంజ్ లో ఒక పెద్ద ప్యాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తాడట. మహాకాళి వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేసుకుంటోంది. సంక్రాంతికి అనుకున్నారు కానీ వేసవి సీజన్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
This post was last modified on April 5, 2025 2:37 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…