ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా చేయడానికి. ఇక అది ఓటిటిలో ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసే సౌలభ్యంతో వస్తే అంతకంటే ఏం కావాలి. నెట్ ఫ్లిక్స్ ‘టెస్ట్’ని ప్రమోట్ చేసినప్పుడు మూవీ లవర్స్ దీని మీద ఆసక్తి కనబరిచారు. నిజానికిది థియేటర్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చి ఆఖరికి డిజిటల్ కు దారి వేసుకుంది. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కం ఎమోషనల్ డ్రామా కేవలం క్యాస్టింగ్ వల్ల హైప్ తెచ్చుకుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రేక్షకుడిని ఓడించింది.
ఎలాగో చూద్దాం. కథ విషయానికి వస్తే టీచర్ కుముద (నయనతార), సైంటిస్ట్ శరవణన్ (మాధవన్) భార్యా భర్తలు. సంతానం ఉండదు. సరోగసి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. స్టార్ క్రికెటర్ గా పేరున్న అర్జున్ (సిద్దార్థ్) ఇండియా టీమ్ లో స్థిరమైన స్థానం సంపాదించుకోలేక ఫామ్ తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఊహించని పరిణామాల మధ్య బెట్టింగ్ మాఫియా వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అర్జున్ కొడుకుని శరవణన్ కిడ్నాప్ చేసే విచిత్రమైన పరిస్థితులు తలెత్తుతాయి. దీనికి ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు మ్యాచుకు ముడి ఉంటుంది. అదేంటి, సంబంధం లేని వీళ్ళ మధ్య ఎందుకిలా జరిగిందనేది అసలు స్టోరీ.
పాయింట్ పరంగా కొంచెం ఆసక్తికరంగా నడిపించే స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు ఎస్ శశికాంత్ ఆ దిశగా బలమైన కథనం రాసుకోలేదు. దాని ఫలితంగా సన్నివేశాల్లో ఎమోషన్ లేక ఏదో భారంగా గడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సిద్దార్థ్, నయన్, మాధవన్ తమ పెర్ఫార్మన్స్ తో ఓ మోస్తరుగా నెట్టుకొచ్చారు కానీ కంటెంట్ కోణంలో చూస్తే మాత్రం ప్రేక్షకుల సహనంతో టెస్టు మ్యాచు ఆడుకునే రేంజ్ లో టెస్ట్ సాగుతుంది. క్యారెక్టరైజేషన్లలో లోపాలు, దారీతెన్నూ లేకుండా నడిచే సీన్లు మొత్తం ఒక ప్రహసనంగా మారిపోతుంది. టన్నుల్లో ఓపిక ఉంటే తప్ప ఇలాంటి టెస్టులను తట్టుకోవడం కష్టం. చివరికి ఓడిపోయింది ఆడియన్సే.
This post was last modified on April 4, 2025 9:08 pm
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…