Movie News

తారక్ VS రజని – ఎవరికి రిస్కు ఎవరికి లాభం

ఆగస్ట్ 14 రజనీకాంత్ కూలి విడుదలవ్వడం ఖాయమనే వార్త చెన్నై మీడియా వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమనడంతో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన మొదలయ్యింది. ఎందుకంటే అదే తేదీకి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉంది. అయితే ఈ క్లాష్ పట్ల తలైవర్ సుముఖంగా లేరని అందుకే ఇంకో ఆప్షన్ చూస్తారనే వార్త వచ్చింది కానీ సన్ పిక్చర్స్ మాత్రం ఇండిపెండెన్స్ డేని వదులుకునే ఉద్దేశంలో లేదని అంతర్గత సమాచారం. ఒకవేళ ఇదే కనక జరిగితే సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ క్లాష్ కి రంగం సిద్ధమైనట్టే. అలా అయిన పక్షంలో రిస్క్ ఎవరికి లాభమెవరికి చూద్దాం.

వార్ 2కి బిజినెస్ పరంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఏపీ తెలంగాణలో విపరీతమైన హైప్ వచ్చేస్తుంది. ఓపెనింగ్స్ పరంగా దేవర, కల్కిలను సులభంగా దాటేస్తుంది. పుష్ప 2ని టార్గెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ కూలికి తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు దన్నుగా నిలుస్తారు. పైగా కళానిధి మారన్ నెట్వర్క్ చిన్నది కాదు. కేరళ, కర్ణాటకలో చాలా పట్టుంది. అలాంటప్పుడు ఆ రాష్ట్రాల్లో వార్ 2 కి స్క్రీన్ కౌంట్ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వార్ 2లో ఇద్దరు హీరోలైతే కూలిలో ఏకంగా నలుగురున్నారు. రజనీకాంత్ తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర పేర్లు మూవీ లవర్స్ ని తెగ ఊరిస్తున్నాయి.

సంగీతం కోణంలో చూసుకున్నా కూలికి అనిరుద్ రవిచందర్ ఇచ్చే సంగీతాన్ని మ్యాచ్ చేయడం ప్రీతమ్ కు అంత సులభంగా ఉండదు. పైగా అతనిది బాలీవుడ్ స్టైల్. మనోళ్లకు అంత సులభంగా ఎక్కవు. వార్ 2లో తారక్, హృతిక్ డాన్సులు, ఫైట్లను మరిపించేలా కూలి కంటెంట్ ని లోకేష్ కనగ రాజ్ డిజైన్ చేయలేదు. సో ఇక్కడ జూనియర్ మూవీకి ఎడ్జ్ ఎక్కువగా వస్తుంది. హోరాహోరీ పోరు తధ్యం. ఒకరికి ఒక రాజ్యంలో పైచేయి అయితే మరొకరికి ఇంకో రాజ్యం అండగా నిలుస్తుంది. మూవీ లవర్స్ అయితే ఇలా జరగకూడదని కోరుకుంటున్నారు. కానీ చివరికి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

This post was last modified on April 4, 2025 6:47 pm

Share

Recent Posts

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

4 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

4 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

5 hours ago

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

6 hours ago

రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…

7 hours ago

దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్…

8 hours ago