Movie News

ప్రియాంకా చోప్రాకు అంత సీన్ ఉందా

అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందు మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ దొరికింది. అందులో తను హీరోయినా లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా లేదు. లీక్స్ అయితే మహేష్ జోడి కాదనే అంటున్నాయి కానీ అది ఎంతవరకు నిజమనేది రాజమౌళి చెబితే తప్ప బయటికి రాదు. కేరళ, హైదరాబాద్ షెడ్యూల్స్ లో పాల్గొన్న ప్రియాంకా చోప్రా తనకు సంబంధించిన కీలక ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారట.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కబోయే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఇటీవలే ప్రియాంకా చోప్రాని సంప్రదించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇందులో కూడా బన్నీతో ఆడిపాడేందుకా లేక ఇంకేదైనా క్యారెక్టర్ గురించి అడిగారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది గాసిప్ స్టేజిలోనే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం. అయినా సరే ఎప్పుడో ఫామ్ తగ్గిపోయిన ఈ క్రేజీ భామకు ఇలా దర్శకులు క్యూ కట్టడం ఆశ్చర్యమే. టాలీవుడ్ కు సంబంధించిన తను ఇప్పటిదాకా జంటగా నటించింది ఒక్క రామ్ చరణ్ తోనే. జంజీర్ (తెలుగు వర్షన్ తుఫాన్) ఎంత దారుణంగా పోయిందో తెలిసిందే.

వీటి సంగతి పక్కనపెడితే ప్రియాంకా చోప్రా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి గుర్తింపు ఉంది. హాలీవుడ్ మూవీస్ తో పాటు సిటాడెల్ వెబ్ వెరీస్ తనకు చాలా పేరు తెచ్చిపెట్టింది. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్నాక కొంత కాలం పరిశ్రమకు దూరంగా ఉన్న ప్రియాంకా చోప్రా ప్రస్తుతం ముంబైలోనే ఉంటోంది. రాజమౌళి పిలుపు వస్తే షూటింగ్ లో హాజరవుతోంది. రెమ్యునరేషన్ కూడా భారీగా ముట్టజెప్పారని సమాచారం. ఇదంతా ఎలా ఉన్నా ఎస్ఎస్ఎంబి 29 మాత్రం పిసి అదృష్టమే. వెయ్యి కోట్ల ప్రాజెక్టులో భాగం కావడం కన్నా నాలుగు పదుల వయసు దాటిన హీరోయిన్ కోరుకునేది ఏముంటుంది.

This post was last modified on April 4, 2025 10:40 am

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

7 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago