గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప 3 ది ర్యాంపేజ్ గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి కానీ అది ఎప్పటికి మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం అట్లీకి కమిట్ మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేతులు కలపబోతున్నాడు. మధ్యలో పుష్ప 3కి సమయం దొరకడం అనుమానమే. అందులోనూ మళ్ళీ జుట్టు, గెడ్డం పెంచి నెలల తరబడి ఉండాలంటే అంత సులభం కాదు. బన్నీకి ఆసక్తి ఉంది కానీ ఇప్పుడప్పుడే చేయాలనే తొందరలేదని అల్లు కాంపౌండ్ లో వినిపిస్తున్న టాక్.
ఇటీవలే ఒక తమిళ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. పుష్ప 2 క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్ ప్రకారం మూడో భాగంలో విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ ఉండే అవకాశముందని, దీంట్లో నిజమెంతని యాంకర్ ప్రశ్నించాడు. దీనికి సుకుమార్ బదులు చెబుతూ అది 2025లో ఉన్న తనకు తెలియదని, 2026లో ఈ స్క్రిప్ట్ రాసే సుకుమార్ ని అడగమని చెప్పి స్మార్ట్ గా తప్పించుకున్నారు. అంటే నిర్ధారణగా ఉందని చెప్పలేదు, అలాని లేదని కొట్టిపారేయలేదు. కాకపోతే ఈ ప్రశ్న నన్ను అడిగినా లాభం లేదనే తరహాలో స్మూత్ గా దాటవేసి అక్కడితో ఆ టాపిక్ ఆపేశారు.
పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయేది సుకుమార్ సినిమానే. ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని చూస్తున్నారు కానీ స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చిందో ఇంకా తెలియాల్సి ఉంది. అది కాగానే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారు. ఒకవేళ ఇది స్టార్ట్ అయితే మాత్రం పుష్ప 3కి చాలా టైం పడుతుంది. ఎంత లేట్ గా వచ్చినా పుష్పరాజ్ క్రేజ్ ఖచ్చితంగా భారీ వసూళ్లతో ఓపెనింగ్ తెస్తుంది. రెండు వేల కోట్ల మార్కు తృటిలో మిస్ చేసుకున్న పుష్ప 2 ఒకవేళ జపాన్, చైనా లాంటి దేశాల్లో కనక హిట్ అయితే ఈజీగా ఆ మైలురాయి దాటేస్తుంది. కాకపోతే అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కీలకం.
This post was last modified on April 2, 2025 8:50 pm
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.…
ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ…
దేశంలో `వన్ నేషన్-వన్ ఎలక్షన్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్రం తలపోస్తున్న విషయం తెలిసిందే. దీనిపై…
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…
టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…