Movie News

హిట్ 3 ప్రపంచంలోకి ఖైదీ వస్తే ?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్లు మొదలపోయాయి. మే 1 విడుదల కాబట్టి ఇప్పటి నుంచే పబ్లిసిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వంత ప్రొడక్షన్ అందులోనూ చాలా పెద్ద బడ్జెట్, పైగా ఈ ఫ్రాంచైజీలో మొదటిసారి హీరోగా చేస్తుండటంతో నాని ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే రోజు సూర్య రెట్రోతో పోటీ ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని హైప్ విషయంలో ఏమేం కావాలో అన్ని ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా హిట్ 3 కి ఒక కోలీవుడ్ హీరో క్యామియో ఉంటుందనే లీక్ ఒక్కసారిగా అభిమానుల అంచనాలు పెంచేస్తోంది.

దాని ప్రకారం హిట్ 3లో ఖైదీ అలియాస్ ఖాకీ హీరో కార్తీ ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. హిట్ 4 ది ఫోర్త్ కేస్ కి లీడ్ ఇచ్చేలా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇప్పించి ఆ తర్వాత శుభం కార్డు వేస్తారని టాక్. గతంలో ఇదే పాత్ర మాస్ మహారాజ రవితేజ చేస్తాడనే టాక్ వచ్చింది. దాదాపు ఖరారే అనుకున్నారు కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఇప్పుడా స్థానంలోకి కార్తీ రావొచ్చని అంటున్నారు. నానితో మంచి బాండింగ్ ఉన్న కార్తీ ఒకవేళ చేసినా ఆశ్చర్యం లేదు. కథకు ఉపయోగపడుతుందనుకుంటే ఖచ్చితంగా ఎస్ అంటాడు. అందులోనూ ఊపిరి తర్వాత టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీలో కార్తీ అసలు కనిపించనే లేదు.

ఇది అధికారికంగా వచ్చింది కాదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ నిప్పులేనిదే పొగరాదు తరహాలో ఏదో మ్యాటర్ అయితే ఉంది. కాశ్మీర్ తో పాటు చాలా రిస్కీ లొకేషన్లలో హిట్ 3 షూట్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. నానిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వయొలెంట్ పోలీస్ గా చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడట. సరిపోదా శనివారం తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన నాని ఈసారి కూడా మాస్ నే టార్గెట్ చేయబోతున్నాడు. హిట్ 3 రిలీజయ్యాక ది ప్యారడైజ్  రావడానికి ఇంకో ఏడాది పడుతుంది కాబట్టి న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ దీని మీద గంపెడాశలు పెట్టుకున్నారు. ట్రైలర్ మూడో వారంలో లాంచ్ చేస్తారట.

This post was last modified on April 2, 2025 4:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

21 minutes ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

24 minutes ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

28 minutes ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

36 minutes ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

45 minutes ago

మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు 'ఫ్రీ బీస్‌' ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది.…

49 minutes ago