Movie News

వీరమల్లు సందేహాలు తీరినట్టే

పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజి జపం ఎక్కువ చేస్తున్నా ముందుగా వచ్చేది హరిహర వీరమల్లునే. మే 9 విడుదల తేదీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఖచ్చితంగా మాట మీద ఉంటుందా లేదానే అనుమానాలు జనంలో లేకపోలేదు. ఇప్పటిదాకా వచ్చిన టీజర్లు, పాటలు బాగానే ఉన్నప్పటికీ ప్యాన్ ఇండియా మూవీకి కావాల్సిన ఎగ్జైట్ మెంట్ ని ఇంకా పూర్తి స్థాయిలో సృష్టించలేకపోయాయి. చూస్తేనేమో చేతిలో పట్టుమని నలభై రోజులు కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో నిజంగా వీరమల్లు అనుకున్న టైంకే వస్తుందా రాదానే డౌట్లు రావడం సహజం. వీటికో క్లారిటీ వస్తోంది.

యూనిట్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు జరగనుంది. ఇందులో పవన్ కాల్ షీట్లు అవసరమయ్యే రోజులు కేవలం నాలుగు. సో పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే షూట్ మొత్తం దాదాపు పూర్తయ్యింది. హీరో అవసరం లేని ఎపిసోడ్లన్నీ దర్శకుడు జ్యోతి కృష్ణ చకచకా తీసేశారు. క్రిష్ డైరెక్ట్ చేసిన భాగాన్ని దీంతో కలిపి ఒక ఫైనల్ ఎడిట్ కాపీని సిద్ధం చేసే పనిలో టీమ్ బిజీగా ఉంది. విఎఫ్ఎక్స్ మీద పలు విదేశీ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. అవి కూడా కొలిక్కి వచ్చినట్టే. సెన్సార్ ని ఏప్రిల్ చివరి వారంలోగా పూర్తి చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం టార్గెట్.

సో ఇక ఫాన్స్ నిశ్చింతగా హరిహర వీరమల్లు ప్రమోషన్లలో భాగం కావొచ్చు. ఇది మొదటి భాగం కావడంతో సీక్వెల్ ఎప్పుడు ప్లాన్ చేయాలనే దాని మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇన్ సైడ్ ఇన్ఫో అయితే పార్ట్ 2 కూడా కీలక భాగం పూర్తయ్యిందట. పవన్ కళ్యాణ్ డేట్లు ఎక్కువ అవసరం లేకుండా వీలైనంత వేగంగా తీసేలా ప్లాన్ చేస్తున్నారట. కాకపోతే పార్ట్ 1 ఎంత స్థాయిలో సక్సెస్ అవుతుందనే దాన్ని బట్టి స్పీడ్ ఆధారపడి ఉంటుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాలో ఔరంగజేబుగా బాబీ డియోల్ పోషించిన పాత్ర, ఎంఎం కీరవాణి సంగీతం కీలకం కానున్నాయి.

This post was last modified on April 2, 2025 11:00 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబుకు నచ్చక పోతే ఇలానే వుంటదా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ట‌యిలే వేరు. పార్టీ నాయ‌కుల విష‌యంలో ఆయ‌న అన్ని కోణాల్లోనూ ప‌రిశీ ల‌న చేస్తారు. విన‌య…

27 minutes ago

క్రియేటివ్ డిఫరెన్స్ గురించి సిద్దు జొన్నలగడ్డ

సృజనాత్మక విబేధాలు (క్రియేటివ్ డిఫరెన్స్) అనే మాట తరచుగా సినిమా షూటింగ్ సమయంలో వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరో, దర్శకుడు,…

44 minutes ago

ట్రెండింగ్ : పచ్చళ్ళ పంచాయితీతో సినిమా ప్రమోషన్లు

కాదేది కవితకు అనర్హం అన్నారో మహాకవి. సోషల్ మీడియా ప్రపంచంలో కవిత తీసేసి దాని స్థానంలో వైరల్ టాపిక్ అని…

57 minutes ago

ఆర్య 2 మీద పుష్ప 2 ప్రభావం

ఈ రోజు ఆర్య 2 రీ రిలీజ్ జరిగింది. అసలు విడుదల టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ…

2 hours ago

పోటాపోటీ నినాదాల మధ్య నాగబాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో గడచి రెండు రోజులుగా టీడీపీ, జనసేన…

2 hours ago

వ్యాపారాన్ని నిర్ణయించబోయే ‘పెద్ది’ షాట్

రేపు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది టీజర్ విడుదల చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బకు తీవ్ర నిరాశలో…

4 hours ago