మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల నెరవేర్చుకునేవాళ్లు కొద్ది మందే. యువ దర్శకుడు వెంకీ కుడుములకు కూడా ఆ ఆవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన అతడికి ఐదేళ్ల ముందు చిరు నుంచి పిలుపొచ్చింది. ఇద్దరి కలయికలో యువి క్రియేషన్స్ సంస్థ సినిమా చేయడానికి రెడీ అయింది.
ముందుగా వెంకీ చెప్పిన లైన్ కూడా చిరుకు నచ్చింది. కానీ ఫుల్ స్క్రిప్టు విన్నాక చిరు సంతృప్తి చెందలేదు. ఇంకో కథ చేసుకుని రమ్మన్నారు. కానీ వెంకీ మాత్రం ఆ ప్రయత్నం చేయకుండా ‘భీష్మ’ హీరో నితిన్‌తోనే ఇంకో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. అదే.. రాబిన్ హుడ్. ఇది తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అని.. దీంతో పెద్ద హిట్ కొడతానని.. మళ్లీ చిరుతో సినిమా కోసం ప్రయత్నిస్తానని చాలా ధీమాగా చెప్పాడు ప్రి రిలీజ్ ఇంటర్వ్యూల్లో వెంకీ.
కట్ చేస్తే ‘రాబిన్ హుడ్’ రిలీజైంది. వెంకీ కెరీర్లో బెస్ట్ మూవీ కాకపోగా.. ముందు చిత్రాలకు దరిదాపుల్లో కూడా నిలవలేకపోయింది. దీని కోసమా వెంకీ ఇన్నేళ్లు కష్టపడ్డాడు అనిపించింది సినిమా చూసిన వాళ్లకు. ‘భీష్మ’ తర్వాత చిరు సినిమా కోసం పెట్టిన టైం.. తర్వాత ‘రాబిన్ హుడ్’ మొదలుపెట్టి పూర్తి చేసి రిలీజ్ చేయడానికి అయిన సమయం కలిపితే మొత్తం ఐదేళ్లు కావడం గమనార్హం. ఇన్నేళ్లు టైం పెట్టి కష్టపడితే చివరికి డిజాస్టర్ రిజల్టే వచ్చింది.
గత వారాంతంలో గట్టి పోటీ మధ్య రిలీజైన ‘రాబిన్ హుడ్’.. ఏమాత్రం నిలబడలేకపోయింది. వీకెండ్లోనే సరైన వసూళ్లు సాధించలేకపోయిన ఈ చిత్రం మీద ఇక ఆశలు పెట్టుకోవడానికి ఏమీ లేదు. ‘భీష్మ’ హిట్టయ్యాక వెంకీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు. అందుకే చిరు నుంచి కూడా పిలుపొచ్చింది. కట్ చేస్తే అటు చిరు సినిమా చేజారింది. ఇటు ‘రాబిన్ హుడ్’ కూడా పోయింది. ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడీ యువ దర్శకుడు. ఈ స్థితిలో తనతో సినిమా చేసే హీరో, నిర్మాత ఎవరో?
This post was last modified on April 2, 2025 7:07 am
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…